వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు..!?

అవును.షాక్ అవుతున్నారు కదా! కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.

సాధారణంగా అయితే ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.కానీ ఒకోసారి ఒకొకరిని పెళ్లి చేసుకుంటాడు.

కానీ ఇక్కడ వరుడు మాత్రం ఏకకాలంలో ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు.అది కూడా పెద్దల సమక్షంలో.

ఏంటి అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్న! పూర్తి వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్ లోని కేరియా గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి బంపర్ ఆఫర్ కొట్టాడు.

ఏంటి అంటే? ప్రేమించిన పిల్లను, పెద్దలు చూసిన పిల్లను ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.

అలా చేసుకోవడానికి కారణం ఏంటి అంటే? సందీప్ కాలేజీ సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

ఇంకా ఇలా ప్రేమ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేసారు.

అయితే ఈ వ్యవహారం పంచాయితీకి చేరడంతో రంగంలోకి దిగిన గ్రామా పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు.

అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు సందీప్ తో కలిసి ఉంటాం అని అన్నారు.

దీనికి వరుడు కూడా ఒకే అనడంతో ఈ నెల 8వ తేదీన మూడు కుటుంబాల సమక్షంలో ఇద్దరి వధువు మేడలో తాళి కట్టాడు.

ఇంకా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లక్కీ బాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ లో మహేష్.. సూపర్ స్టార్ కొత్త లుక్ మామూలుగా లేదుగా!