నెలరోజుల్లోనే ఇద్దరికీ తాళి కట్టిన యువకుడు.. చివరికి!?  

man married two women in same month, marriages, Man, Nizamabad, Police Station - Telugu Man, Man Married Two Women In Same Month, Marriages, Nizamabad, Police Station

అవునండి.ఓ వ్యక్తి ఓకే నెలలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.షాకింగ్ గా ఉంది.కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.నిజామాబాద్ జిల్లాలో బోధన్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరి 26న అందాపూర్‌కు చెందిన మనీషా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

 Man Married Two Women One Month

అయితే నెల రోజులు కూడా పూర్తి అవ్వకముందే మంచిర్యాలకు చెందిన వనజ అనే యువతిని మార్చి 20న యాదగిరిగుట్టలో రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇది తెలియక ఇద్దరి భార్యలతో కొద్దిరోజులు బాగానే గడిచింది.

కానీ మొదటి భార్య మనీషాకు భర్త శ్రీకాంత్ పై అనుమానం రావడంతో రెండో పెళ్లి విషయం బయటపడింది.

నెలరోజుల్లోనే ఇద్దరికీ తాళి కట్టిన యువకుడు.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే భర్త శ్రీకాంత్ చేసిన మోసాన్ని భరించలేక మనీషా తనకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది.

పెళ్లి పేరిట శ్రీకాంత్ మహిళలను మోసం చేస్తున్నాడు అని.అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసుల ముందు డిమాండ్ చేసింది.ఇంకా ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి.కాగా శ్రీకాంత్‌‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి.కాగా నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

#Man #Nizamabad #Police Station #Marriages

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Married Two Women One Month Related Telugu News,Photos/Pics,Images..