ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని ప్రియుడు ఏకంగా....

Man Love Failure Telangana

ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు కలిసి ఎలాగో జీవించలేనప్పుడు చావే శరణ్యం అనుకొని ఆత్మహత్య చేసుకుంటూ  తమ కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నారు.తాజాగా ఓ యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమై, నిశ్చితార్థం కూడా జరగడంతో తన ప్రేమ ఓడిపోతుందని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

 Man Love Failure Telangana-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని లింగంపల్లి పరిసర ప్రాంతంలో ఓ యువకుడు నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై గొర్రెల మోపుతూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని ప్రేమించాడు.అయితే అతడి ప్రేమ విషయం  ప్రేమిస్తున్న యువతికి తెలపగా అందుకు ఆమె కూడా సరే అంది.

అయితే తాజాగా యువకుడు గొర్రెలు మేపడం కోసం వేరే ప్రాంతానికి వెళ్లి ఉంటున్నాడు.ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమయింది అలాగే ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది.

 Man Love Failure Telangana-ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని ప్రియుడు ఏకంగా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయాన్ని యువకుడు తమ బంధువుల ద్వారా తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.అంతేకాక బ్రతికి ఉండి తన ప్రేమని గెలిపించుకోలేకపోయనని  రోజూ తనలో తానే మదన పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇందులో భాగంగా పంట పొలాలకు ఉపయోగించేటటువంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన తొటి గొర్రెల కాపరులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం ఆ కుటుంబాన్ని ఎంతగానో కలిచి వేసింది.అలాగే కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#Love Breakup #Khammam #Commits

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube