ఉద్యోగం పోయింది.. రూ.31 కోట్లు వరించాయ్.. ఎలా అంటే?  

man who lost job as a security guard during pandemic wins rs 31 crore lottery man, lost job, security guard, pandemic, wins rs 31 crore lottery - Telugu Lost Job, Man, Pandemic, Security Guard, Wins Rs 31 Crore Lottery

కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది.లాక్ డౌన్ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్దున పడ్డారు.

 Man Lost Job Security Guard Pandemic Wins Rs 31 Crore Lottery

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పెద్దపెద్ద వ్యాపార సంస్థలు సైతం నష్టాలను చవిచూస్తున్నాయి.చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా కష్టాలు పడుతూ ముందడుగులు వేస్తున్నారు.

పేద, మధ్యతరగతి వర్గాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.ఆస్ట్రేలియాకు చెందిన ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్ జీవితం కూడా కరోనా వల్ల పూర్తిగా మారిపోయింది.

ఉద్యోగం పోయింది.. రూ.31 కోట్లు వరించాయ్.. ఎలా అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ వల్ల సెక్యూరిటీ గార్డు ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు.అయితే అతనిని ఊహించని విధంగా అదృష్టం వరించింది.ఉద్యోగం కోల్పోతే అదృష్టం వరించడం ఏమిటి….? అని అనుకుంటున్నారా….? కరోనా, లాక్ డౌన్ వల్ల అతనికి ఇబ్బందులు ఎదురైనా లాటరీ రూపంలో అతనిని లక్ష్మీదేవి వరించడంతో కోట్ల రూపాయలు అతని సొంతమయ్యాయి.పెర్త్‌లోని అర్మడాలేలో నివశించే ఒక వ్యక్తి తన మూడేళ్ల కూతురుతో సరుకులు కొనడానికి షాప్ కు వెళ్లి ఆ దుకాణానికి సమీపంలో ఉన్న లాటరీవెస్ట్ లో లాటరీని కొనుగోలు చేశాడు.

ఆ తరువాత అతను ఉద్యోగం కోల్పోగా అదే సమయంలో లాటరీ సంస్థ సదరు వ్యక్తి లాటరీ గెలుచుకున్నట్టు తెలిపింది.ఊహించని విధంగా అదృష్టం లాటరీ రూపంలో రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

లాటరీ గెలిచిన వెంటనే ఆ వ్యక్తి కూతురును ప్రేమగా కౌగిలించుకున్నాడు.గెలుచుకున్న డబ్బుతో తనకు, తన తమ్మునికి రెండు ఇళ్లు కట్టిస్తానని… పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించి మిగిలిన డబ్బుతో కొత్త జీవితాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నానని మీడియాకు చెప్పాడు.

#Man #Security Guard #Pandemic #Lost Job

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Lost Job Security Guard Pandemic Wins Rs 31 Crore Lottery Related Telugu News,Photos/Pics,Images..