సముద్రంలో పడ్డ వ్యక్తి ప్రాణాలు కాపాడిన జీన్స్‌ ప్యాంట్‌.. ఇతడి సమయస్ఫూర్తికి హ్యాట్సాప్‌  

  • కొన్ని సార్లు సమయస్ఫూర్తితో ఆలోచిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్న సమయంలో హరీబరీగా ఆందోళన చెందకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ ఆపద నుండి బయట పడవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో చుట్టు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆ సమయంలో కొందరు మాత్రం మినిమం ప్రయత్నం చేయరు. ప్రయత్నిస్తే ఎక్కువ సమయం బతికే అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేయకుంటే తక్కువ సమయంకు చనిపోయే ఛాన్స్‌ ఉంటుంది. జర్మనీకి చెందిన మూర్కె అనే వ్యక్తి సముద్రంలో పడ్డాడు. ఇక తాను బతకడం కష్టమే అనుకున్నాడు. అయితే తన 10 సంవత్సరాల పాట తండ్రి లేని పాపగా బతకవద్దని భావించాడు. బలంగా నిర్ణయించుకుని అతడు పోరాడాడు.

  • వివరాల్లోకి వెళ్తే… అర్నె మూర్కె తన సోదరుడితో కలిసి సముద్ర మార్గం ద్వారా అక్లాండ్‌ నుండి బ్రెజిల్‌కు బయల్దేరాడు. వారు చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో గాలుల తీవ్రత పెరిగింది. పడవ ఒడుదొడుకులకు గురైంది. ఆ సమయంలో మూర్కె సముద్రంలో పడిపోయాడు. ఆ సమయంలో మూర్కె సోదరుడు లైఫ్‌ జాకెట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే గాలి ఎక్కువ రావడంతో పాటు సముద్రపు అలలు ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్‌ జాకెట్‌ విసిరినా కూడా అది మూర్కె వద్దకు చేరలేదు. పడవకు మూర్కెకు దూరం పెరిగి పోయింది. ఈత వచ్చిన మూర్కె తన ప్రణాలను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించాడు. అయితే ఎక్కువ సమయం ఈత కొట్టడం కష్టం అని ఆయనకు తెలుసు. అందుకు ఏదైనా లైఫ్‌ జాకెట్‌ ఉంటే బాగుండు అనుకున్నాడు.

  • Man Lost For Hours At Sea Survives By Turning Jeans Into Life Jacket-Jeans Pant Makeshift Jacket Navy Seal Trick

    Man Lost For Hours At Sea Survives By Turning Jeans Into Life Jacket

  • అప్పుడే తన జీన్స్‌ ప్యాంట్‌ను లైఫ్‌ జాకెట్‌ గా వినియోగించుకోవాలనుకున్నాడు. వెంటనే జీన్స్‌ ప్యాంట్‌ ను విడిచి అందులో గాలి నింపాడు. ఒక వైపు మూసి గాలి ఊది మరో వైపు మూసేశాడు. జీన్స్‌ ఫ్యాంట్ క్లాత్ అయినా కూడా మందం గా ఉంటుంది. కనుక కొంత సమయం ఆయనకు అది లైఫ్ జాకెట్ గా ఉపయోగపడింది. అలా చాలా సార్లు దాన్ని గాలితో నింపి తన ప్రాణాలను కాపాడుకున్నాడట. దాదాపు మూడున్నర గంటల పాటు అతడు సముద్రంలో జీన్స్ పాయింట్ సాయంతో ఉండగలిగాడు. ప్రాణాలతో బయటపడ్డ మూర్కే సంతోషంగా తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు.