ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 పిల్లులను పెంచుతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా..?

చాలా మంది ప్రజలు తమ పెంపుడు జంతువులతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకుంటారు.కొందరు తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాటిని అత్యంత ప్రేమగా చూసుకుంటారు.

 Man Living With 70 Cats Alone In Uk Why Because-TeluguStop.com

అలాగే తమ ఇంట్లో సకల సౌకర్యాలు అనుభవించేందుకు అనుమతిస్తుంటారు.సాధారణంగా జంతు ప్రేమికులు ఒక కుక్క, పిల్లి లేదా ఏదో ఒక ఇతర జంతువును పెంచుకుంటారు.

మరికొందరు రకరకాల జంతువులను పెంచుతారు.ఎంతటి ధనికులైనా.

 Man Living With 70 Cats Alone In Uk Why Because-ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 పిల్లులను పెంచుతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహా అంటే పది లోపే జంతువులను పెంచుకోగలుగుతారు.కానీ యూకే కి చెందిన ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 70 పిల్లులను పెంచుకుంటున్నాడు.

అతని ఇల్లు పెద్దదా అంటే అదీ లేదు.చాలా చిన్న ఇంట్లో అదికూడా అతనొక్కడే 70 పిల్లులను పెంచుతున్నాడు.

ఇతని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇదేం విడ్డూరం అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.అయితే 70 పిల్లులను పెంచుతుడడంతో ఇరుగుపొరుగు వారు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట.

వివరాల్లోకి వెళితే.యూకేకు చెందిన ఇయాన్(56) ఎపిలెప్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ వ్యాధితో బాధపడేవారికి తరచుగా ఫిట్స్ వస్తాయి.ఈ వ్యాధిగ్రస్తులు పదేపదే మూర్ఛ పోతుంటే ఎవరో ఒకరు పక్కన ఉండి సంరక్షించాలి ఉంటుంది.

లేదంటే జీవితం చాలా కష్టమైపోతుంది.ఇయాన్ బాగోగులు చూసుకునేందుకు ఏ మనిషి కూడా తోడుగా ఉండడం లేదు.

దాంతో అతడు పిల్లుల పై పూర్తిగా ఆధారపడతాడు.

Telugu 70 Cats, Animals, Disease, Epilepsy Disease, Health, Living, Man Living, Pet Lovers, Social Media, Social Media Viral, Uk Man, Uk Man Eon, Viral Latest, Viral News-Latest News - Telugu

తనకు మూర్చ వచ్చిన ప్రతిసారి పిల్లులు సహాయం చేస్తాయని అంటున్నాడు.అంతేకాదు ఎపిలెప్సీ వ్యాధితో బాధ పడుతున్న ప్రతి ఒక్కరూ పిల్లులను పెంచుకోవాలని సలహా ఇస్తున్నాడు.కానీ భారీ సంఖ్యలో పిల్లులను పెంచుతుండడంతో ఇంటి పక్కన నివసించేవారు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అతను ఈ పిల్లులను పరిసరాల్లో వాకింగ్ కోసం బయటికి కూడా తీసుకెళ్తున్నాడు.అయితే చాలా చిన్న ఇంట్లో పిల్లులను బంధించితే వాటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని కొందరు జంతు ప్రేమికులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

#UK #Animals #Uk #Epilepsy #Cats

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు