టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని ఏం చేశాడో తెలుసా?  

Man Kills Person For Tv Sound Issue In Armoor - Telugu Armoor News, Crime News, Man, Murder, Tv Sound

ఈ రోజుల్లో మనుష్యులు ఎందుకు కోపడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు.ఒక్కోసారి వారి కోపం ఎదుటివారి ప్రాణాలమీదకు తీసుకొస్తుందనే విషయాన్ని కూడా వారు మరిచిపోతుండటంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి.

Man Kills Person For Tv Sound Issue In Armoor - Telugu Armoor News, Crime News, Man, Murder, Tv Sound-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.తన భార్యతో గొడవ పడుతున్న ఓ భర్త కోపంతో ఊగిపోయాడు.

ఆర్మూర్‌లోని గోల్ బంగ్లాలో నివాసముంటున్న సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40) బుధవారం రాత్రి టీవీ చూస్తున్నాడు.తన ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య తన భార్యతో గొడవపడుతున్నాడు.ఈ క్రమంలో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడనే కోపంతో రాజేందర్ తలపై బాలనర్సయ్య బలంగా కొట్టాడు.దీంతో రాజేందర్ అక్కడే పడిపోయాడు.

కాగా అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కోపంతో విచక్షణా రహితంగా ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన బాలనర్సయ్యను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

కాగా మృతుడు రాజేందర్‌కు భార్య, ఒక కొడుకు ఉన్నారు.కోపం కారణంగా ఓ మనిషి ప్రాణం పోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

Man Kills Person For Tv Sound Issue In Armoor-crime News,man,murder,tv Sound Related....