తన గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్ లో బ్లాక్ చేసిందని ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేసాడో తెలుసా...  

Man Kills Girlfriend For Blocking Him On Whatsapp-phone Calls,uae,వాట్సాప్ లో బ్లాక్

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక అద్భుతమైన ఫీలింగ్ . ప్రేమికులు ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఫోన్ లు మాట్లాడుకోవడం , చాటింగ్ చేసుకోవడం చేస్తుంటారు. అలా తమ అభిప్రాయాలను పంచుకొని నచ్చితే ఇంకో అడుగు ముందుకు వేస్తారు..

తన గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్ లో బ్లాక్ చేసిందని ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేసాడో తెలుసా...-Man Kills Girlfriend For Blocking Him On Whatsapp

అయితే ఈ విషయం లో కొన్ని సార్లు ప్రేమించిన అబ్బాయి లేదా అమ్మాయి లు తమ భాగస్వామికి సరైన కారణం చేప్పకుండా ఒక్కసారిగా మాట్లాడడం ఆపేస్తున్నారు , దానితో ఆ వ్యక్తి లో భావోద్వేగాలు ఎక్కువై క్షణికవేశం లో తప్పులు చేయాల్సివస్తుంది. అటువంటి సంఘటనే ఒకటి యూ.ఏ.

ఈ లో జరిగింది. ప్రేమిస్తున్న ప్రియురాలు కారణం లేకుండా వాట్సాప్ లో బ్లాక్ చేసిందని ఆమె ప్రియుడు ఏం చేసాడో తెలుసా ? అసలు విషయానికొస్తయూ.ఏ.

ఈ లో ప్రముఖ కంపెనీ లో పనిచేస్తున్న ఒక యువతికి అక్కడే నివసిస్తున్న ఒక యువకుడి తో పరిచయం అయింది. అది కాస్త స్నేహంగా మారడం తో ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకొని రోజు గంటలు తరబడి ఫోన్ లు , చాటింగ్ లు చేసుకున్నారు.దాదాపు నెలరోజుల పాటు వారు చెట్టాపట్టాలేసుకుని తిరిగేసారు.

ఒకరికొకరు నచ్చడం తో ఆ యువకుడు తనని పెళ్లి చేసుకుంటావా ? అంటూ ఆమెని అడిగాడు . ఆమె కూడా అతడిని ఇష్టపడుతుండడం తో అతను అడిగిన దానికి అంగీకరించింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ యువతి సడెన్ గా అతడితో మాట్లాడటం ఆపేసింది.

ఆ యువకుడి ఫోన్ నెంబర్ ని కూడా తన వాట్సాప్ లో బ్లాక్ చేసింది .దీనితో ఆమెకి చాలా సార్లు ఫోన్ కాల్స్ , మెసేజ్ లు చేసిన ఆమె స్పందించలేదు , ఆ ప్రేమికుడికి ఏం చేయాలో తోచక కోపం తో యువతి పనిచేసే చోటుకు వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. చాలా సేపు ఇద్దరి మధ్య గొడవ జరగగా ఆ యువకుడు తను ప్రేమించిన యువతి గొంతు నులిమి, టవల్‌తో ఆమె ముఖాన్ని కప్పేసి అతి కిరాతకంగా హత్య చేశాడు.

యువతి చనిపోయాక ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీస్ లు పట్టుకుంటారేమో అనే భయం తో దేశం విడిచి పారిపోడానికి ప్రయత్నించినప్పటికీ యువతి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. యువతిని హత్య చేసినందుకు అతనికి పదేళ్ల జైలు శిక్ష పడింది.