హిజ్రా ని ప్రాణంగా ప్రేమించాడు.. కానీ....  

man killed his transgender lover in ahmedabad - Telugu Ahmedabad Crime News, Ahmedabad Latest News, Ahmedabad Local News, Ahmedabad News, Transgender Love Afaire, Transgender Lover, Transgender Lover News

ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశానికి లోనై తమ అనుకున్న వాళ్లను కడతేర్చి కటకటాల పాలవుతూ తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.తాజాగా ప్రాణానికి ప్రాణంగా హిజ్రా ని ప్రేమించినటువంటి ఓ యువకుడు క్షణికావేశానికి లోనై ఆమెను హతమార్చి న ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహమదాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

Man Killed His Transgender Lover In Ahmedabad

వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్ ప్రాంతంలో మమతా మసి అనే హిజ్రా నివాసం ఉంటోంది.ఈమె స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది.దీంతో ఇద్దరు మొదట్లో ఎక్కడికెళ్లినా చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉండే వాళ్ళు.అంతేగాక మమత , తన ప్రియుడు మరియు  తన ప్రియుడి స్నేహితుడు కలిసి ఒకె  ఇంటిలో నివసించే వాళ్ళు.

అయితే కొద్దిరోజుల తర్వాత మమత స్నేహితురాలైన మరో హిజ్రా ని తన ప్రియుడికి పరిచయం చేసింది.ఈ క్రమంలో మమతా ప్రియుడు మరియు ఆమె స్నేహితురాలు కొంతమేర సన్నిహితంగా మెలిగేవారు.

దీంతో వారిద్దరిపై అనుమానం పెంచుకున్నటువంటి మమత తన స్నేహితురాలికి దూరంగా ఉండాలని పలుమార్లు తన ప్రియుడిని హెచ్చరించింది.

అంతేగాక ఈ మధ్యకాలంలో ఈ అనుమానం పెనుభూతమై ఈ విషయంపై మరింతగా తన ప్రియుడితో గొడవ పడుతూ ఉండేది.అయితే మమతా ప్రియుడు మాత్రం తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని నాకు అన్నీ నువ్వే అని చెప్పినా కూడా మమత అసలు వినేది కాదు.దీంతో ఇద్దరు ఈ విషయమై  నిన్నటి  రోజున మళ్ళీ గొడవ పడ్డారు.

 ఈ గొడవలో మాట మాట పెరిగి తీవ్ర ఆగ్రహానికి గురైన టువంటి మమత ప్రియుడు ఆమెపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.ఈ విషయాన్ని గమనించి నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.

ఇందులో భాగంగా నిందితుడు మమత ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Killed His Transgender Lover In Ahmedabad Related Telugu News,Photos/Pics,Images..