భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఏకంగా…  

Man Killed His Wife In Kurnool - Telugu Crime News, Kurnool, Man Killed His Wife, Married Women Murder

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా నిండు జీవితాలు బలవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధం పెట్టుకుందనే కేవలం అనుమానం కారణంగానే ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.

 Man Killed His Wife In Kurnool

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి ఓ ప్రాంతంలో చలపతి గౌడ్ మరియు కుమారి అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.అయితే పెళ్లైన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

కాగా చలపతి గౌడ్ కుటుంబ పోషణ  నిమిత్తమై  స్థానిక గ్రామంలో చిన్నచిన్న పనులు చేస్తూ ఉండేవాడు.అయితే ఇటీవల దళపతి గౌడ్ భార్య కుమారి స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతుంది.

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఏకంగా…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తిరుపతి గౌడ్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.ఈ విషయం గురించి పలుమార్లు తన భార్యతో గొడవ పడేవాడు.

 ఈ క్రమంలో నిజా నిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఆమెను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.అయితే ఆ సమయంలో తన భార్యకి గాయాలు బలంగా తగలడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇది గమనించిన స్థానికులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అలాగే స్థానికులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు