పెళ్లయి 9 నెలలు కావస్తున్నా పిల్లలు పుట్ట లేదని...  

Man Killed His Wife In Anantapur District - Telugu Anantapur, Anantapur Crime News, Anantapur Latest News, Anantapur Local News, Anantapur News, Man Killed His Wife, Man News

ప్రస్తుత కాలంలో కొందరు అవగాహన లేమితో అపార్థం చేసుకుంటూ ఎదుటి వారి ప్రాణాలను తీసేస్తున్నారు.దీనివల్ల వీళ్ళని నమ్ముకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.

Man Killed His Wife In Anantapur District - Telugu Anantapur, Anantapur Crime News, Anantapur Latest News, Anantapur Local News, Anantapur News, Man Killed His Wife, Man News-Latest News-Telugu Tollywood Photo Image

తాజాగా ఓ వ్యక్తి పెళ్లి అయ్యి 9 నెలలు కావస్తున్నా తన భార్య గర్భం దాల్చలేదని కారణంగా తలపై బలంగా బండరాయితో మోది హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని కనేకల్ మండలానికి చెందినటువంటి ఓ గ్రామంలో సురేష్ మరియు అతడి భార్య లలిత అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.

అయితే వీరికి గత ఏడాదిలో వివాహం అయింది.అయితే పెళ్లైన మొదట్లో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.అయితే రాను రాను సురేష్ తన భార్య పై పలు అనుమానాలు పెంచుకున్నాడు.ఇందులో భాగంగా పెళ్లయి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇంకా గర్భం దాల్చక పోవడంతో నిత్యం తన భార్య లలితను  వేధించేవాడు.

అయితే  దగ్గరలో ఉన్నటువంటి పీర్ల చావడిలో ముడుపు కడితే పిల్లలు పుడతారని పలువురు గ్రామ పెద్దలు చెప్పడంతో ఇద్దరూ కలిసి పీర్ల చావిడి కి వెళ్లారు.అయితే ఈ క్రమంలో లలిత  పుట్టినిల్లు తారకాపురం కూడా దగ్గర్లో ఉండటంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి లలిత పుట్టింటికి వెళ్లారు.

అయితే ఇంట్లో లేని సమయంలో చిన్న విషయమే ఇద్దరు తగువ పడ్డారు.ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన టువంటి సురేష్ చేతికందిన బండరాయితో లలిత తలపై గట్టిగా మోదాడు.తలకి బలమైన గాయం అవడంతో లలిత అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో భయపడిన టువంటి సురేష్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి ఊరి బయట ఉన్నటువంటి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అలాగే మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తాజా వార్తలు