దారుణం : టీ లో చక్కెర తక్కువైందని భార్యని దారుణంగా కత్తితో…  

Man Killed His Wife For Sugar Less In Tea - Telugu Babloo Kumar, Crime News, Men Killed His Wife, Sugar Less Tea, Uttar Pradesh

ప్రస్తుత కాలంలో కొందరు ప్రతీ చిన్న విషయానికి ఆవేశానికి లోనవుతూ హత్యలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి టీ లోకి పంచదార తక్కువ వేసి ఇచ్చిందని తన ఏకంగా కట్టుకున్న భార్యని దారుణంగా గొంతు కోసి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Man Killed His Wife For Sugar Less In Tea

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ పరిసర ప్రాంతంలో నివాసముంటున్నాడు.అయితే ఈ వ్యక్తి భార్య గర్భంతో ఉంది.కాగా ఎప్పటిలాగే వివాహిత తన భర్తకు ఉదయం లేచిన సమయంలో తేనీటి పానీయాన్ని అందించింది.అయితే టీ లో చక్కెర తక్కువయిందని ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన వ్యక్తి తన భార్యపై కత్తితో దారుణంగా దాడి చేశాడు.దీంతో తీవ్ర రక్తస్రావానికి గురయినటువంటి వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది.

దారుణం : టీ లో చక్కెర తక్కువైందని భార్యని దారుణంగా కత్తితో…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో భయపడిన మృతురాలి భర్త వెంటనే అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా పరారయ్యాడు.

కాగా స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అలాగే స్థానికులు మరియు మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.మరి కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రస్తుత జనరేషన్ లో కొందరు ప్రతి చిన్న విషయానికి హత్యలు చేస్తున్నారని కాబట్టి నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Killed His Wife For Sugar Less In Tea Related Telugu News,Photos/Pics,Images..

footer-test