డబ్బు పంపకాల విషయంలో పిల్లనిచ్చిన మామనే హత్య చేసిన అల్లుడు..!

ప్రస్తుత సమాజంలో డబ్బు ముందు కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి.డబ్బు కోసం ఎటువంటి దారుణాలు చేయడానికి అయినా కొంతమంది వెనుకాడడం లేదు.

ఈ కోవలోనే డబ్బు పంపకాల విషయంలో పిల్లనిచ్చిన మామనే అత్యంత దారుణంగా అల్లుడు హత్య చేశాడు.ఈ ఘటన నల్లగోండ జిల్లాలో( Nalgonda District ) చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నల్లగొండ జిల్లా పెద్ద అడచరపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన చిన్న మారయ్య, మంగమ్మ దంపతులకు వెంకటమ్మ, లక్ష్మమ్మ అనే ఇద్దరు కుమార్తెలు సంతానం.పెద్ద కుమార్తె వెంకటమ్మను( Venkatamma ) పీఏ పల్లి మండలం గణపురం, చిన్న కుమార్తె లక్ష్మమ్మను( Lakshmamma ) గుర్రంపోడు మండలం తెరాటిగూడెంకు ఇచ్చి వివాహం చేశారు.

Advertisement
Man Killed Father In Law With Money Distribution Issues Details, Father In Law

చిన్న మారయ్యకు మగసంతానం లేని కారణంగా ఇద్దరు అల్లుళ్లను తన సొంత కుమారులు లాగా చూసుకునేవాడు.

Man Killed Father In Law With Money Distribution Issues Details, Father In Law

చిన్న మారయ్య తన ఇద్దరు అల్లుళ్లకు చెరో 3.5 ఎకరాలు పంచి ఇచ్చాడు.ఇక చివరగా చిన్న మారయ్య దగ్గర 1.13 గుంటల భూమి మాత్రమే మిగిలిఉంది.ఇటీవలే ఆ భూమిని విక్రయించగా రూ.35 లక్షల రూపాయలు వచ్చాయి.అయితే పెద్ద కుమార్తె కుటుంబం కాస్త ఆర్థికంగా చితికి పోవడంతో, పెద్ద కుమార్తె వెంకటమ్మకు రూ.10 లక్షలు, చిన్న కుమార్తె లక్ష్మమ్మకు రూ.8 లక్షలు ఇచ్చాడు.

Man Killed Father In Law With Money Distribution Issues Details, Father In Law

అయితే డబ్బు పంపకాల విషయంలో పెద్ద అల్లుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడంటూ చిన్న అల్లుడు నారాయణ( Narayana ) తన మామపై కోపాన్ని పెంచుకున్నాడు.నారాయణ పొల్కంపల్లికి వచ్చి ఈ విషయంపై అత్తతో గొడవపడ్డాడు.అనంతరం పొలం దగ్గర మేకలు మేస్తున్న చిన్న మారయ్య( Chinna Maraiah ) దగ్గరకు వెళ్లి తనకు ఎందుకు తక్కువ డబ్బులు ఇచ్చావని ప్రశ్నించడంతో మామ-అల్లుళ్ళ మధ్య ఘర్షణ మొదలైంది.

క్షణికావేశంలో నారాయణ పక్కనే ఉండే బండరాయిని తీసుకొని చిన్న మారయ్య తలపై మోపాడు.క్షణాల్లో కుప్పకూలి చిన్న మారయ్య ప్రాణాలు విడిచాడు.సాయంత్రం అయినా మారయ్య ఇంటికి రావకపోవడంతో అతని భార్య మంగమ్మ పొలం దగ్గరకు వెళ్లి వెతకగా పొలంలో మిగతాజీవిగా పడి ఉన్నాడు.

మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నారాయణ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు