పిల్లాడిని కిడ్నాప్‌ చేసి, తల్లిని లొంగ దీసుకునే ప్రయత్నం.. ఆమె ఏం చేసిందో తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు  

Man Kidnap A Boy And Harass Woman For Illegal Affair-

మన దేశంతో పాటు ప్రపంచ మొత్తంలో కూడా ఎక్కువ నేరాలకు అక్రమ సంబంధాలు కారణం అని పలు సర్వేల్లో వెళ్లడి అయ్యింది. పెళ్లి అయిన తర్వాత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అది ఎప్పటికి అయినా ప్రమాదమే అనే విషయం గతంలో పలు సంఘటనల ద్వారా నిరూపితం అయ్యింది. అయినా కూడా కొందరు ఇంకా అక్రమ సంబంధాలతో, తుచ్చమైన కోరికలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు..

పిల్లాడిని కిడ్నాప్‌ చేసి, తల్లిని లొంగ దీసుకునే ప్రయత్నం.. ఆమె ఏం చేసిందో తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు-Man Kidnap A Boy And Harass Woman For Illegal Affair

తాజాగా యూపీలోని లక్నో శివారు ప్రాంతంలో ఉండే ఒక మహిళ జీవితం నాశనం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఆనందికి పది సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆనందికి మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. భర్త స్నేహితుడు అయిన ఆ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

భర్త లేని సమయంలో అతడు ఇంటికి రావడం, ఆనంది అతడితో కలిసి బయట తిరగడం వంటివి చేసేది. ఇద్దరి మద్య వ్యవహారం చాలా వరకు సాగింది. విషయం ఆనంది భర్తకు తెలియడంతో అతడు మందలించాడు.

ఇలా మరోసారి జరిగితే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ భర్త బెదించాడు. దాంతో ఆనంది భర్త పిల్లల కోసం అక్రమ సంబంధంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని అతడికి దూరంగా ఉంటూ వచ్చింది.ఆనంది దూరం పెట్టినా అతడు మాత్రం ఆమెను వదలాలని అనుకోలేదు.

ఆమెను రమ్మంటూ పదే పదే ఫోర్స్‌ చేశాడు. ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఎంతకు ఆమె ఒప్పుకోక పోవడంతో ఆనంది నాలుగు సంవత్సరాల కొడుకును కిడ్నాప్‌ చేశాడు.

నీ కొడుకు కావాలి అంటే నా కోరిక తీర్చాలి, నాతో సంబంధం కొనసాగించాలంటూ ఫోన్‌లో చెప్పాడు. బాలుడిని హింసిస్తున్న ఫొటోలు వాట్సప్‌ ద్వారా పంపించడం జరిగింది. కన్న కొడుకును అలా చేయడంతో ఆనంది తట్టుకోలేక పోయింది.

ఇది ఇక్కడితో అయ్యేది కాదని భావించి తన మరణమే ఇందుకు శరణ్యం అంటూ, అతడితో అక్రమ సంబంధం, కొడుకు కిడ్నాప్‌ గురించి లెటర్‌ లో రాసి మరీ ఆత్మ హత్య చేసుకుంది. మంచిగా మారాలని భావించినా ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందని ఆనంది విషయం ద్వారా తెలుసుకోవాలి. సంతోషకరమైన జీవితంను నాశనం చేసుకుంది.

బాలుడిని కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.