'ఆవు'ను కొట్టాడు.. దూడ ప్రతీకారం తీర్చుకుంది!

తల్లీబిడ్డల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం.బిడ్డకు ఇతరుల నుంచి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తల్లి సహించదు.

 Man Gets Kick From Calf For Beating Another Cow  Man, Kick From Calf, Beating Co-TeluguStop.com

అదే సమయంలో తల్లి ఇబ్బందుల్లో ఉందంటే బిడ్డ భరించలేదు.మనుషుల్లోనే కాదు జంతువుల్లో సైతం ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఇదే విధంగా ఉంటాయి.

తాజాగా జరిగిన ఒక ఘటనలో తల్లిని ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తికి దూడ చుక్కలు చూపించింది.

ఇండియ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత్ నంద దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఒక వ్యక్తి తెల్లని దుస్తులు వేసుకొని ఆవును కర్రతో చితకబాదుతూ ఓవరాక్షన్ చేశాడు.సమీపంలోనే ఉన్న దూడ ఇదంతా గమనించింది.తల్లిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని ఊరికే వదలకూడదని భావించి పరుగెత్తుకుంటూ వెళ్లి తన్నింది.

దూడ తన్నడంతో తెల్లటి దుస్తుల్లో ఉన్న వ్యక్తి పేడలో పడ్డాడు.

దూడ ఓవరాక్షన్ చేసిన వ్యక్తికి కాలి దెబ్బను రుచి చూపించింది.పేడలో పడిన ఆ వ్యక్తికి దూడ తగిన శాస్తి చేసిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మూగజీవాలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోకపోతే దెబ్బలు తినడంతో పాటు నవ్వులపాలు కావాల్సి వస్తుందని దూడ ప్రూవ్ చేసింది.కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తల్లిని కొడితే బిడ్డ ఊరుకుంటుందా…? అని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube