రోడ్డుపై ఘర్షణ..చిన్న గొడవకే కారు బొనెట్ మీద లాక్కెళ్లిన డ్రైవర్..వీడియో వైరల్!

అప్పుడప్పుడు అనుకోకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి.కొంతమంది చూసి చూడకుండా వెళ్లి పోతారు.

 Man In Lucknow Kanpur Drags Truck Driver On Cars Bonnet, Man On Car Bonnet, Kanp-TeluguStop.com

మరి కొంతమంది మాత్రం చిన్న గొడవలకే కొట్లాట వరకు వెళ్లి ఆ కోపంతోనే చివరకు చంపుకోవడం వరకు వెళ్తాము.తాజాగా రోడ్డు మీద జరిగిన చిన్న ఘర్షణ చిలికి చిలికి ప్రాణాలతో చెలగాటం అదే వరకు వెళ్ళింది.

ఈ వీడియో చుస్తే మీకే తెలుస్తుంది.ఈ డ్రైవర్ ఎంత పెద్ద తప్పు చేసాడో.

రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా వేరే వాళ్ళ చేత తిట్లు తింటూ ఉంటాం.మనం మన వాహనాలను ఎంత జాగ్రత్తగా నడుపుతున్న అవతలి వ్యక్తి చిన్న పొరపాటు చేస్తే చాలు.

దానికి మనం కూడా బలవుతాం.తాజాగా రోడ్డుపై ఇద్దరి డ్రైవర్లు గొడవ పడ్డారు.

ఆ గొడవ పెరి పెద్దది అయ్యి చివరకు ప్రాణాలతోనే ఆడే వరకు వెళ్ళింది.

ఒక వ్యక్తి ట్విట్టర్ లో ఒక వీడియో ను పోస్ట్ చేసాడు.

ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.

అందులో ఒక డ్రైవర్ తన కారు బొనెట్ మీద ఒక వ్యక్తి పడిన కూడా అలానే కారు నడుపుతూ వెళ్ళాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఘటన లక్నో కాన్పూర్ ఫ్లై ఓవర్ మీద జరిగింది.

ఈ ఫ్లై ఓవర్ మీద ఒక ట్రక్కు, ఒక ఆటో ఢీ కొన్నాయి.దీంతో ఆ ఇద్దరి డ్రైవర్స్ మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవలో ట్రక్కు డ్రైవర్ కారుకు ఎదురుగ వచ్చి మాట్లాడుతుండడంతో కారు డ్రైవర్ అతడిని ఢీ కొట్టాడు.అప్పుడు ట్రక్కు డ్రైవర్ కారు బొనెట్ మీద పడ్డ కూడా అలానే కారుతో ముందు వెళ్లి పోయాడు.రోడ్డు మీద వెళ్లే వారు ఈ వీడియో తీయడంతో అది కాస్త బయటకు వచ్చింది.పోలీసులను ట్యాగ్ చేస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు.

నిందితుడిని త్వరలోనే పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube