కూతురి చేత హోం వర్క్ చేయించడానికి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చిన యజమాని  

Man In China Trains Pet Dog To Supervise His Daughter-parents,tension,training,యజమాని

పిల్లల చేత హోం వర్క్ చేయించడానికి తల్లి,దండ్రులు ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే. పిల్లలు ఆట మీద చూపే శ్రద్ద హోం వర్క్ పూర్తి చేయడంలో చూపించరు. ఈ క్రమంలో హోం వర్క్ పూర్తి చేయించటానికి తల్లి దండ్రులకు తల ప్రాణం తొక్కొస్తుంది అని చెప్పాలి..

కూతురి చేత హోం వర్క్ చేయించడానికి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చిన యజమాని -Man In China Trains Pet Dog To Supervise His Daughter

అయితే ఇలాంటి టెన్షన్ ఏమీ తీసుకోకూడదు అని భావించిన ఓ తండ్రి తన కూతురి హోం వర్క్ పూర్తి చేయించే భాద్యతను తన పెంపుడు కుక్కకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే… చైనా కు చెందిన సంబంజూ లియాంగ్ అనే వ్యక్తి తన కూతురి చేత హోం వర్క్ చేయించే భాద్యతను తన పెంపుడు కుక్కకు అప్పగించాడు. ఇందుకోసం కుక్కకు ప్రత్యేకంగా ట్రేనింగ్ సైతం ఇచ్చాడు. దీనితో జూ కుమార్తె హోం వర్క్ చేస్తున్నంత సేపు ఆమె ఎటూ కదలకుండా ఆమెకు ఎదురుగా నిల్చుని పర్యవేక్షిస్తుంటుంది.

ఒక వేళ ఆ అమ్మాయి గనుక హోం వర్క్ చేయకుండా మధ్యలో ఆటలు ఆడితే ఊరుకోదట. జూ కుమార్తె హోం వర్క్ పూర్తి చేయకుండా గోల చేస్తుండడం తో జూ వినూత్నంగా ఇలాంటి ఆలోచన చేసాడు. అయితే తండ్రి ఆలోచన జూ కూతురికి కూడా నచ్చిందట.

నా కుక్కతో కలిసి హోం వర్క్ చేయడం చాలా బాగుందని,ఇంతకు ముందు హోం వర్క్ చేయాలంటే చాలా బోర్ కొట్టేది కానీ ఇప్పుడు చాలా శ్రద్ద గా హోం వర్క్ పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా మొత్తానికి పిల్లల చేత హోం వర్క్ కంప్లీట్ చేయించడానికి ఈ ఆలోచన బాగానే ఉంది. తల్లి దండ్రులకు ఎలాంటి శ్రమ లేకుండా ఇలా పెంపుడు కుక్కకు ట్రేనింగ్ ఇచ్చి ఆ భాద్యతను అప్పగించేస్తే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.

మరి ఎంతమంది ఈ ఆలోచనను ఫాలో అవుతారో చూడాలి.