వీధి మద్యలో ప్రియుడిని 50 సార్లు కొట్టిన ప్రియురాలు... అతడి ఓపికకు కాళ్లకు దండం పెటొచ్చు  

Man In China Gets Slapped 52 Times In Public By Girlfriend On Chinese-

కొన్ని సంఘటనలు చూస్తుంటే అత్యంత బాధకరం అనిపిస్తాయి. అయితే ఆ సంఘటన వివరాల్లోకి వెళ్లే మాత్రం జరిగింది కరెక్ట్‌ అనిపిస్తుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొడుతున్న సమయంలో అయ్యో పాపం అనిపిస్తుంది..

వీధి మద్యలో ప్రియుడిని 50 సార్లు కొట్టిన ప్రియురాలు... అతడి ఓపికకు కాళ్లకు దండం పెటొచ్చు-Man In China Gets Slapped 52 Times In Public By Girlfriend On Chinese

అదే ఆ వ్యక్తి ఎందుకు కొడుతున్నాడో తెలిస్తే బాగానే కొడుతున్నాడులే, అలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష పడాల్సిందే అనుకుంటాం. తాజాగా చైనాలోకి ఒక రద్దీ వీధిలో ఒక వ్యక్తిని ఒక మహిళ ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉంది. దాదాపు 50 చెంప దెబ్బలు కొట్టింది. చుట్టు చూస్తున్న జనాలు తమ ఫోన్‌లలో వీడియోలు తీస్తున్నారు తప్ప అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాకు చెందిన డజౌ అనే నగరంలో ఇటీవల ప్రేమికులకు సంబంధించిన ఒక వేడుక జరిగింది. ఆ వేడుకలో తన ప్రియుడు తనకు ఏదైనా మంచి బహుమానం ఇస్తాడని ఆశించింది. కాని ఆమె ఆశ నిరాశ అయ్యింది. ఆమెకు అతడు ఏ బహుమానం ఇవ్వలేదు.

అమె పరువును అందరి ముందు తీశాడు. స్నేహితుల లవర్స్‌ బహుమానాలు ఇవ్వడం, తన లవర్‌ బహుమానం ఇవ్వక పోవడంతో ఆమె అవమానంగా ఫీల్‌ అయ్యింది. దాంతో అతడిని నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లుగా కొట్టింది.

ఆమె అంతగా కొట్టినా కూడా అతడు మాత్రం ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. అతడు ఆవిడ దెబ్బలకు అలాగే నిల్చున్నాడు. అతడి ప్రవర్తన చూసి స్థానికులు అవాక్కయ్యారు. అంతగా కొడుతున్నా అతడు ఎందుకు నవ్వుతూనే ఉన్నాడు, ఆమె చేస్తున్నది కరెక్ట అంటూ కొందరు అనుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో కూడా ఇంకా ఆమె కొడుతూనే ఉంది. ఆమె నుండి అతడిని దూరంగా తీసుకు వెళ్లారు. ఆమెను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా, అతడు పోలీసులను వేడుకున్నాడు..

తన లవర్‌ను వదిలి పెట్టాలంటూ అతడు విజ్ఞప్తి చేయడం జరిగింది. తన లవర్‌ను అరెస్ట్‌ చేయవద్దని అతడు కోరుకోవడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అతడు ఆమెను చాలా ఘాడంగా ప్రేమిస్తూ ఉంటే, ఆమె మాత్రం కేవలం బహుమానాల కోసం ప్రేమించినట్లుగాఉ ందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.