కొత్త కారా మజాకానా... షోరూమ్ లోనే తన దూకుడు ఏంటో చూపించేసిందిగా...!

ఒకప్పుడు కారు అనేది లగ్జరి లైఫ్ కి సింబల్ గా చెప్పుకునే వారు.కానీ ఇప్పుడు కారు కొనడం అంటే సర్వ సాధారణ మైన విషయం అయిపోయింది.

 Man Hits Mahindra Showroom Glass And Railing With New Car In Bangalore Details,-TeluguStop.com

అయితే కారు కొనడం అనేది చిన్నా చితక అయిన పని కాదు అనే చెప్పాలి కొన్ని లక్షలు పెడితేనే కానీ కొత్త కారును.కొనుగోలు చేయలేము.

అయితే మనం కొత్త కారు కొన్నప్పుడు వచ్చే మజానే వేరు కదా.ఎక్కడ లేని.సంతోషం, పట్టరాని ఆనందం అన్ని కలిసి ఎప్పుడెప్పుడు ఆ కారును డ్రైవ్ చేస్తామా అనే అతృతతో ఉంటాము కదా.అలాంటిది ఆ కొత్త కారుకు ఏదన్నా డ్యామేజ్ అయితే ఆ ఆనందం కొన్ని క్షణాలు కూడా ఉండదు కదా.మరి దారుణం ఏంటంటే కొన్న కారు కనీసం రోడ్డు మీదకి కూడా రాకుండానే ఏకంగా షో రూమ్ లోనే డ్యామేజ్ అయితే ఆ బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది.

అసలు వివరాల్లోకి వెళితే.బెంగళూరులోని మహీంద్ర షోరూమ్‌లో ఓ కస్టమర్ ఎంతో ముచ్చటపడి కొన్ని లక్షలు చెల్లించి మరి థార్ కారును కొనుగోలు చేశాడు.

కాగా అతనికి కార్ కొన్న ఆనందం ఏ మాత్రం మిగలలేదనే చెప్పాలి.ఎందుకంటే కారు డెలివరీ రోజునే డ్యామేజ్ కి గురి అయింది కాబట్టి.

అతను కారును డెలివెరీ రోజున టెస్ట్ డ్రైవ్ చేయాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా కారు ఇంజన్ స్టార్ట్ చేశాడు.

అంతే కారు ఒక్కసారిగా దూసుకెళ్లిపోయింది.ఒకవేళ అతనికి డ్రైవింగ్ లో అంత అనుభవం లేకపోవడం వల్లనో లేక ఆ కారు ఇంజన్ లో ఏమైనా లోపం ఉందో అనే విషయం అయితే తెలియదు కానీ అతను కార్ ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కారు ఒక్కసారిగా షోరూమ్ అద్దాలను బద్దలు కొట్టుకొని మరి షోరూమ్ బాల్కనీలోకి వెళ్ళింది.

అక్కడ గల షోరూమ్ ముందు భాగంలోని రెయిలింగ్స్‌ను ఢీకొట్టి అలా ఉండిపోయింది.ఆనంద పడాలిసిన విషయం ఏంటంటే ఆ కారు అక్కడితోనే ఆగిపోవడం.ఒకవేళ అది కనుక అక్కడితో ఆగకుండా ఉంటే మాత్రం భారీ నష్టం జరిగేది.కారు అదుపు తప్పడం గమనించిన షో రూమ్ సిబ్బంది వేంటనే రంగంలోకి దిగి కారును ఎలాగోలా తిరిగి షోరూమ్ లోపల పెట్టేసారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయ్యారు.కారును లోపల పెట్టిన తరువాత హమ్మయ్య అనుకున్నారు.కారు యజమాని టైమ్ బాగుంది అని చాలామంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube