కొత్త కారుతో జింకలను ఢీ కొట్టిన వ్యక్తి.. చివరికి?

కొన్నిసార్లు మనకు అదృష్టం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.అలా అదృష్టం వచ్చినప్పుడు ఎవరైనా సరే కోటీశ్వరులవుతారు.

 American Man Anthony Hits Two Deers With His New Car And Then Hits Two Million D-TeluguStop.com

ఈ విధంగా ఎంతోమంది విషయంలో ఎన్నో సార్లు జరిగింది.అయితే ప్రస్తుతం అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి కూడా అదృష్టం తలుపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

తన జీవితంలో దురదృష్టం వెంటాడుతోందని బాధ పడుతున్న సమయంలో అదృష్టం వెంట రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.పూర్తి వివరాల్లోకి వెళితే….

అమెరికాకు చెందిన ఆంటోనీ డోవ్ అనే వ్యక్తి బ్రాండ్ న్యూ కారును కొన్నాడు.మరుసటి రోజు ఉదయం ఆ కారులో ఆఫీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా రెండు జింకలు వచ్చాయి.

అయితే వాటిని తప్పించే క్రమంలో కారును అదుపు చేయలేక అతని కారుకు కొంతవరకు ప్రమాదం జరిగింది.కారు కొన్న ఆనందం కొన్ని రోజులు కూడా లేకుండానే , కారుకు ప్రమాదం జరగడంతో కారును ఎలా రిపేర్ చేయించాలని బాధ పడుతున్న తరుణంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది.

ఉదయం నిద్ర లేచేసరికి తన జీవితమే మారిపోయింది.

Telugu America, American, Anthony, Deer, Lottery, Car, Deers, Dollars Lottery-La

ఉదయం నిద్రలేవగానే ఆంటోని తను కొనుక్కున్న లాటరీ టికెట్ నెంబర్లను చెక్ చేసుకున్న ఆంటోనికి షాకింగ్ న్యూస్ తెలిసింది.అతను కొన్న లాటరీ టికెట్ గెలవడంతో ఏకంగా రెండు మిలియన్ డాలర్లు అంటే 14.6 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు.ఒక్కసారిగా లాటరి టికెట్ లో ఇంత పెద్ద మొత్తం గెలుచుకోవడంతో అతని ఆనందం రెట్టింపయింది.గెలుచుకున్న డబ్బులలో పన్నులు చెల్లించగా అతనికి 10.2 కోట్ల రూపాయలు చేతికి అందడంతో అతను ఆ డబ్బుతో కారు రిపేరు చేయించుకొని, మరి కొంత డబ్బుతో తన ఇంటి మరమ్మతులు చేయిస్తానని తెలియజేశారు.తన కారుకు దెబ్బ తగలిందని బాధపడిన ఆంటోనికి అదృష్టం లాటరీ రూపంలో రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube