డ్రగ్స్ మాఫియా కు మరోకొత్త దారి,చివరికి చెప్పుల్లో కూడా  

Man Hidden Drugs In His Slippers-

ఒకప్పుడు డ్రగ్స్ సరఫరా చేయడం అంటే మాఫియా కు పెద్ద తలనొప్పిగా ఉండేది.ఈ డ్రగ్స్ సరఫరా చేయడం కోసం ఇప్పుడు మాఫియా కొత్త కొత్త దారులు వెతుకుతుంది.నిజంగా డ్రగ్స్ సరఫరా కి ఇలాంటి దారులు కూడా ఉంటాయా అన్న ఆశ్చర్యం కలగకమానదు...

Man Hidden Drugs In His Slippers--Man Hidden Drugs In His Slippers-

కడుపులో డ్రగ్స్ సరఫరా చేయడం లేదంటే మరేదో దారి ని ఎంచుకోవడం జరుగుతుంది.అయితే తాజాగా ఒక అంతర్జాతీయ స్మగ్లర్ చెప్పుల్లో డ్రగ్స్ ని సరఫరా చేసే ప్రయత్నం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఇంతక ముందు షూస్ లో ఇలాగా డ్రగ్స్ సరఫరా చేసేవారు,కానీ చెప్పులలో కూడా డ్రగ్స్ ని సరఫరా చేయొచ్చు అని ఈ సంఘటనతో అర్ధం అవుతుంది.

కేరళలోని కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఓ అంతర్జాతీయ స్మగ్లర్ చెప్పులో మారిజునా అనే మత్తు పదార్థం లభించింది.స్మగ్లర్ చాలా తెలివిగా చెప్పుల్లో అడుగుభాగంలో ఈ మత్తుపదార్దాలను పెట్టుకొని రవాణా చేస్తున్నాడు.దీంతో ఆ అంతర్జాతీయ స్మగ్లర్ ని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Man Hidden Drugs In His Slippers--Man Hidden Drugs In His Slippers-

తొలుత అతడి తొడ వద్ద 210 గ్రాముల మారిజునా మత్తు పదార్ధాన్ని కనుగొన్న అధికారులు ఆ తరువాత ఇంటెన్సివ్‌ స్క్రీనింగ్‌ అనంతరం 690 గ్రామలు మత్తపదార్ధాన్ని నిందితుని చెప్పు మధ్య భాగంలో దాచినట్లు గుర్తించారు.దీంతో వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు.అయితే మొత్తం స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువ సుమారు 7 లక్షలు ఉంటుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.