సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి.మహిళల ఫోన్ నంబర్లు సేకరించి న్యూడ్ ఫోటోలు పంపించాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు.
మరికొందరు పరిచయాలు పెంచుకుని, ప్రేమిస్తున్నానని నమ్మించి న్యూడ్ ఫోటోలు సేకరించి డబ్బులు ఇవ్వాలని బెదరింపులకు పాల్పడుతున్నారు.
న్యూడ్ ఫోటోలు పంపించాలని ఓ మహిళా న్యాయవాదిని వేధిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
నగరానికి చెందిన దుర్గాప్రసాద్(23) ఓ ప్రైవేట్ ఉద్యోగి.రోజూ పోర్న్ వీడియోలు చూడటంతో బానిసైన అతడు సోషల్ మీడియా ద్వారా మహిళల ఫోన్ నంబర్లు సేకరించి, వారికి అసభ్యకరమైన మెసేజ్ లు పంపించేవాడు.
మహిళలకు వీడియో కాల్ చేస్తూ నగ్నంగా కనిపించాలని, లేకపోతే వారి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు.ఈ మేరకు నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదితో తరచూ వాట్సాప్ మెసేజ్ చేసేవాడు.
అసభ్యకరమైన మాటలు మాట్లాడంతో విసిగిపోయిన మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.
దుర్గాప్రసాద్ గతంలోనూ నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.నల్గొండ, సైబరాబాద్ అతడిపై పలు కేసులున్నాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నాడు.