లోన్ ఇవ్వని బ్యాంక్‌కు తుపాకీతో వచ్చిన ఘనుడు

బ్యాంకుకు డబ్బులతో, చెక్కు, పాస్ పుస్తకాలతో వెళ్లే వారిని చాలా మందిని చూసుంటాం.కానీ బ్యాంకుకు ఏకంగా తుపాకీతో వెళ్లాడు ఓ ప్రబుద్ధుడు.

 Man Goes To Bank Withgun Due To Loan Rejection-TeluguStop.com

ఇంతకీ అతడు తుపాకీతో ఎందుకు వెళ్లాడో, బ్యాంకులో ఏం చేశాడో తెలియాలంటే కోయంబత్తూర్‌లోని కెనరా బ్యాంక్‌లో జరిగి ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.

వెట్రివేల్ అనే వ్యక్తి మోటార్ తయారీ పరిశ్రమను నిర్వహిస్తు్న్నాడు.

ఈ క్రమంలో వ్యాపార రుణం కోసం బ్యాంకులో రూ.కోటి కోసం లోన్ అప్లై చేశాడు.దీని కోసం ఓ బ్రోకర్‌కు 3 లక్షల వరకు చెల్లించుకున్నాడు.అయినా అతడి లోన్‌ను బ్యాంక్‌ రిజెక్ట్ చేసింది.దీంతో కోపంతో ఊగిపోయిన అతడు తన వెంట ఓ తుపాకీని తీసుకుని బ్యాంక్‌కు వెళ్లాడు.మేనేజర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

కాగా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపై కూడా అతడు దాడి చేశాడు.దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వెట్రివేల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై మేనేజర్ మాట్లాడుతూ వెట్రివేల్ లోన్‌ను హెడ్ ఆఫీస్ నుండి రిజెక్ట్ చేశారని, బ్రాంచ్ ఆఫీస్‌కు సంబంధం లేదని తెలిపాడు.కాగా తనకు లోన్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వెట్రివేల్ అంటోన్నాడు.

మరి ఈ ఘటనపై పోలీసులు ఏం మాట్లాడుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube