క్యాపిటల్ బిల్డింగ్‌‌పై దాడి ఘటన: పోలీసులపైనే చేయి చేసుకుని, విధ్వంసం .. నిందితుడికి జైలు శిక్ష

యూఎస్ క్యాపిటల్‌పై దాడి సమయంలో పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు భౌతికదాడికి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుడికి కోర్ట్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.రాబర్ట్ స్కాట్ పామర్ (54).

 Man Gets 5 Years In Prison For Assaulting Police Officers In Us Capitol Attack,-TeluguStop.com

జనవరి 6న యూఎస్ క్యాపిటల్ వెలుపల పోలీసులపై బోర్డులు, ఇతర వస్తువులను విసిరేశాడు.ఆ సమయంలో అతను ట్రంప్ అనుకూల ప్యాచ్‌లతో వున్న జెండా, ఫ్లోరిడా ఫర్ ట్రంప్ అనే టోపీని ధరించిన వీడియోలు, ఫోటోలలో కనిపించాడు.

ఉద్రిక్త పరిస్ధితుల వేళ.రాబర్ట్ క్యాపిటల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.అయితే భద్రతా దళాల ముందు అతని ఆటలు సాగలేదు.సెక్యూరిటీ సిబ్బంది పెప్పర్ స్ప్రే ప్రయోగించడంతో రాబర్ట్ వెనక్కి వచ్చేశాడు.దీనిపై కోపంతో ఊగిపోయిన అతను పోలీసులపై చేతికి ఏది దొరికితే అది విసిరేశాడు.చివరికి భద్రతా సిబ్బంది రబ్బరు బుల్లెట్లకు పనిచెప్పడంతో అల్లరి మూక చెల్లా చెదురయ్యారు.

క్యాపిటల్ హిల్‌పై దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో రాబర్ట్‌ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్టోంబర్‌ 4న నేరారోపణ జరిగినప్పటికీ అతను తన చర్యను సమర్ధించుకుంటూనే వున్నాడు.

క్యాపిటల్ దాడి ఘటనకు సంబంధించి 700 మందిపై అభియోగాలు మోపగా.ఇద్దరికి 41 నెలల కఠిన జైలు శిక్షను విధించింది కోర్టు .వీరిలో ఎక్కువ మంది అక్రమంగా క్యాపిటల్‌లోకి ప్రవేశించడం వంటి చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారే.కానీ డజన్ల మంది మాత్రం ఆయుధాలు వెంట బెట్టుకోవడం, అధికారులపై దాడి వంటి ఘోరమైన నేరాలకు పాల్పడ్డట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు.

Telugu Prison, Capitol, Florida, Joe Biden, Trump, Capitol Attack, Presidential-

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube