మాజీ ప్రియుడు ముద్దు పెట్టడం తో గర్ల్ ఫ్రెండ్ కి 300 కుట్లు పడ్డాయి.. అసలు విషయం ఇదే..  

Man Gets 12 Years In Prison For Biting Ex-girlfriend\'s Lip Off,-kayla Hayes,kayla Hayes And Seth Fleury,seth Fleury,telugu Viral News,viral In Social Media,గర్ల్ ఫ్రెండ్ కి 300 కుట్లు

ఎవరైనా అబ్బాయి ముద్దు పెడితే అమ్మాయి పెదాలు సిగ్గుతో ముడుచుకోవాలి. ప్రేమతో ముద్దు పెడితే అమ్మాయి ఆనందం తో పరవశించాలి. కానీ ఒక ప్రియుడు తన ప్రియురాలికి బలవంతపు ముద్దు పెట్టి ఆమె కి 300 కుట్లు పడేలా చేసాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

మాజీ ప్రియుడు ముద్దు పెట్టడం తో గర్ల్ ఫ్రెండ్ కి 300 కుట్లు పడ్డాయి.. అసలు విషయం ఇదే..-Man Gets 12 Years In Prison For Biting Ex-girlfriend's Lip Off,

అసలు విషయానికొస్తే

అమెరికాలో సౌత్ కరోలినా లోని గ్రీన్‌విల్లే ఏరియా లో నివసిస్తున్న కైలా అనే యువతి అదే ప్రాంతానికి చెందిన సేథ్ అరన్ అనే యువకుడి తో కొంత కాలం ప్రేమలో ఉంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో కొన్నాళ్ల వారి డేటింగ్ తరువాత కైలా తన ప్రియుడైన సేథ్ ని దూరం పెట్టింది. అతనిని పూర్తిగా కలవడం , మాట్లాడటం మానేసింది. అప్పుడే కైలా కి బ్లేక్ అనే యువకుడితో పరిచయం అయింది.

అతని ప్రవర్తన నచ్చిన కైలా బ్లేక్ తో కొంత కాలంగా ప్రేమలో ఉంది..

కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది , సేథ్ అరన్ తన మాజీ ప్రేయసి కైలా ని మర్చిపోలేక ఆమెకి ఫోన్ లు చేయడం మొదలెట్టాడు. ఆమెని క్షమించమని మెసేజ్ లు , కాల్ లు చేసాడు. అప్పటికి బ్లేక్ తో ప్రేమలో ఉన్న కైలా సేథ్ పంపిన మెసేజ్ లు ఫోన్ లు పట్టిచుకోలేదు.

కైలా అలా ప్రవర్తించడం తో ఏం చేయాలో తోచక సేథ్ అరన్ కైలా కి చివరి సరిగా ఒకసారి కలవాలని ప్రాధేయ పడుతూ ఆమెకి గ్రీటింగ్ కార్డ్ పంపాడు. సేథ్ పంపిన గ్రీటింగ్ కార్డ్ నచ్చి అతనిని కలవడానికి కైలా అంగీకరించింది..

కైలా , సేథ్ అరన్ వాళ్ళు ఎప్పుడు కలుసుకునే ప్రదేశం లొనే కలుసుకున్నారు. సేథ్ తన మాజీ ప్రేయసి కైలా కి ఎప్పటికి గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని ఆమెకి ముద్దు పెట్టాలని ప్రయత్నించాడు.

అప్పటికి బ్లేక్ తో ప్రేమలో ఉన్న కైలా దానికి ఒప్పుకోలేదు.దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సేథ్ కైలాను గట్టిగా పట్టుకుని ఆమె పెదవుల కింద గట్టిగా కొరికేశాడు. కసితీరా కోరకడంతో పెదవుల కిందా, పైనా తీవ్ర రక్తస్రావం అయ్యింది..

ఆసుపత్రికి వెళ్లగా కైలాకు 300 కుట్లు వేశారు వైద్యులు. సేథ్ ని అరెస్ట్ చేసిన పోలీస్ లు అతనిని న్యాయస్తానం లో ప్రవేశ పెట్టగా సేథ్ తను చేసిన నేరాన్ని అంగీకరించడం తో అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు.