మొసలి నోట్లో చిక్కుకున్న వ్యక్తి.. ఎలా బయటపడ్డాడో తెలుసా?  

Man S Himself Form Crocodile Mouth-crocodile,death,man,weird News

క్రూర జంతువులకు చిక్కిన వారు సాధారణంగా బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు.ఇందులో సింహం, పులి, మొసలి లాంటి జంతువుల బారిన పడి తమ ప్రాణాలు దక్కించుకున్న వారి సంఖ్య చాలా తక్కువ.అయితే తాజాగా ఓ అధికారి మాత్రం మొసలి నోట్లో చావు చివరి వరకు వెళ్లి బతికి బట్ట కట్టాడు.ఇంతకీ ఆ వ్యక్తి ఎలా బతికాడో తెలిస్తే అవాక్కవ్వడం మనవంతు అవుతుంది.

Man S Himself Form Crocodile Mouth-crocodile,death,man,weird News Telugu Viral News Man S Himself Form Crocodile Mouth-crocodile Death Man Weird News-Man Frees Himself Form Crocodile Mouth-Crocodile Death Man Weird News

ఆస్ట్రేలియాకు చెందిన క్రెయిగ్ డిక్‌మన్ అనే వ్యక్తి రోజూలాగే చేపలు పట్టేందుకు క్రొకోడైల్ కంట్రీ అనే ప్రాంతానికి వెళ్లాడు.అక్కడ అతడు చేపలు పడుతున్న సమయంలో వెనకనుండి తొమ్మిది అడుగుల మొసలి ఒకటి అతడిపై దాడి చేసి అతడి కాలును ఒడిసి పట్టింది.దీంతో అతడు మొసలి బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయసాగాడు.అయితే మొసలి చర్మం చాలా బలంగా ఉండటంతో దాన్ని చంపడం అతడి వల్ల కాదని నిర్ణయించుకున్నాడు.

వెంటనే అతడు తన తెలివికి పని చెప్పి, ఆ మొసలి కళ్లలో తన చేతివేళ్లతో పొడిచాడు.మొసలి అతడిని నీటిలోకి లాగడం ఆపేసేంత వరకు ఆ వ్యక్తి మొసలి కళ్లలో చేతివేళ్లతో పొడుస్తూనే ఉన్నాడు.దీంతో మొసలి అతడిని వదిలేసి నీటిలోకి వెళ్లిపోయింది.వెంటనే అతడు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి పరుగులు తీశాడు.

కాగా అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.