నదిలో ఏర్పడ్డ మనిషి - మొసలి స్నేహ బంధం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మనం సరదాగా స్నానం చేయడానికి ఏ నదిలోకో లేదంటే సముద్రానికో వెళ్లి స్నానం చేస్తుంటే అనుకోకుండా అక్కడ ఒక మొసలి మన కంట పడితే.? వామ్మో ఉహించుకోవడానికే గుండె ధడేల్ మంటుంది కదా.ఎందుకంటే., మొసలి పేరు వింటే ఎవరికన్నా చెమటలు పట్టడం ఖాయం.

 Man Formed In The River - Crocodile Friendship .. What Is The Real Matter ..?! M-TeluguStop.com

నీటిలో ఉన్న మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది.ఒకసారి అది చంపాలని ఫిక్స్ అయితే దాని చేతిలో ఖతం అవ్వడం గ్యారంటీ.

అందుకే మొసలిని చూసి ఎవ్వరయిన కన్ను తెరిచి మూసే లోపల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుండి పారిపోతాం.కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఎంచక్కా స్విమ్మింగ్ చేద్దామని నదిలోకి వెళ్లిన మనిషిని అక్కడే ఉన్న మొసలి చూసి తినేద్దామని అతని దగ్గరకు వచ్చింది.

అతనికి ఒక్కసారిగా మొసలిని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి.ఏమి చేయాలిరా దేవుడా అనుకుని అటు ఇటు చూడడం మొదలుపెట్టాడు.కానీ విచిత్రం ఏమిటో గాని వీరిద్దరి మధ్య మంచి స్నేహ బద్ధం ఏర్పడింది.ఏంటి షాక్ అయ్యారా కావాలనుంటే ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.

నది మధ్యలో స్విమ్మింగ్‌ చేస్తున్న ఆయనవైపు ఓ మొసలి ఈదుతూ వేగంగా అతని దగ్గరకు వస్తుంది.మొసలిని చూసి అతను అక్కడి నుంచి భయపడి పారిపోకుండా మొసలిని ఆప్యాయంగా అతనికి చేతుల్లోకి తీసుకున్నాడు.అనంతరం ఆ మొసలిని ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకున్నట్లు భుజంపై వేసుకున్నాడు.మొసలి కూడా అతన్ని చంపకుండా ఏదో పరిచయం ఉన్న స్నేహితుడిలాగా అతని భుజంపైకి ఎంచక్కా ఎక్కేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube