వైరల్.. చేతులులేని వ్యక్తికి మరొకరి చేతులు పెట్టిన డాక్టర్స్..ఆ తర్వాత..!

చేతులు లేని వారి బాధ వర్ణనాతీతం.పుట్టినప్పటి నుండి చేతులు లేని వారి కన్నా కూడా మధ్యలో ప్రమాదాల వల్ల చేతులు కోల్పోయిన వారు ఇంకా బాధపడతారు.

 Man Fitted With Donor Arms In First Double Transplant Is Waiting To Hugging His-TeluguStop.com

జీవితంలో అన్ని పోగొట్టుకున్నట్టు జీవిస్తారు.కేవలం కొంతమంది మాత్రమే మొండి ధైర్యంతో తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.

ఇప్పుడు కృతిమంగా అమర్చే చేతులు అందుబాటులోకి వచ్చిన అవి మన చేతులు లేని లోటును పూర్తిగా తీర్చలేవు.

తాజాగా రెండు చేతులు లేని ఒక వ్యక్తికి డాక్టర్స్ సర్జరీ చేతి మరి వేరొకరి చేతులను అమర్చారు.

ఒక ప్రమాదంలో కోల్పోయిన అతని చేతులు మళ్ళీ లభించడంతో అందరు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది.

ఆ డాక్టర్స్ ను అందరు మెచ్చుకుంటున్నారు.అతనికి చేసిన సర్జరి సక్సెస్ అయ్యిందని వైద్యులు తెలిపారు.

అతడు ఐస్ల్యాండ్ కు చెందిన వ్యక్తి.అతడు ఎలెక్ట్రీషియన్ కావడంతో కరెంట్ లైన్ ఫిక్స్ చేస్తుండగా షాక్ తగిలి 1998 లో అతడు తన చేతులను పోగొట్టుకున్నాడు.

దాదాపు 23 సంవత్సరాలుగా అతడు చేతులు లేకుండా జీవిస్తున్నాడు.ఆ ప్రమాదం జరిగిన తర్వాత అతడు మూడు నెలలు కోమాలో ఉన్నాడు.అప్పుడు డాక్టర్స్ అతడికి 54 సర్జరీలు చేసి అతడి ప్రాణాలను అయితే కాపాడారు.కానీ అతడి చేతులు మాత్రం తొలగించాల్సి వచ్చింది.

2007 లో అతడు టివి లో ఒక ప్రకటన చూసి అక్కడ ప్రముఖ డాక్టర్ ను కలిసి తన పరిస్థితి వివరించగా అతడికి చేతులు సర్జరీ చేయించుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అని డాక్టర్ చెప్పాడు.

దాంతో అప్పటి నుండి అతడు సర్జరీ చేయించు కునేందుకు చూస్తున్నాడు.చివరకు ఈ సంవత్సరం జనవరి 12 న జరిగిన సర్జరీ తర్వాత అతడు చిన్నగా చేతులు కదిలించడం మొదలు పెట్టాడు.

తన చేతులు వచ్చిన సందర్భంగా ముందుగా తన భార్యను, ఆ తర్వాత పిల్లలను, మనవళ్లు, మనవరాళ్లను సంతోషంగా హాగ్ చేసుకుని కంటతడి పెట్టుకున్నాడు.

అన్ని కష్టాలు తర్వాత చివరకు తన చేతులను పొందగలిగాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube