మాజీ భార్యపై అభ్యంతరకర పోస్టులు, భారీ జరిమానా విధించిన కోర్టు

మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఒక బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.మాజీ భర్త తన మాజీ భార్య ను వెక్కిరిస్తూ పెట్టిన పోస్ట్ కు అబుదాబీ కోర్టు అతడికి ఏకంగా 20 వేల దిర్హామ్‌ల జరిమానా విధించింది.అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.3 లక్షల 89 వేల రూపాయలు అన్నమాట.వివరాల్లోకి వెళితే… ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో తన మాజీ భార్య ను వెక్కిరిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు.ఈ కోతి నుంచి ఉపశమనం పొందాను ఆమె నరకానికి వెళ్లని అంటూ పోస్ట్ పెట్టాడు.

 Man Fined Rs 4 Lakh-TeluguStop.com

అంతటితో ఆగకుండా ఆమె కు తరచూ వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్ లతో పాటు ఫోటోలు,వీడియో లు షేర్ చేస్తూ వేధింపులు గురిచేస్తున్నాడు.దీనితో విసిరిగిపోయిన ఆ బాధితురాలు తట్టుకోలేక కోర్టు మెట్లు ఎక్కి ఆవేదన వ్యక్తం చేసింది.

దీనితో విచారణ చేపట్టిన కోర్టు అతడిని వివరణ కోరగా తన మాజీ భార్యకు ఎలాంటి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టలేదంటూ అతడు చెప్పాడు.అయితే అతడి మాజీ భార్య సాక్ష్యాలు కోర్టు కు చూపడం తో విశ్వసించిన కోర్టు అతడికి భారీ జరిమానా విధించింది.

అయితే నిందితుడు కింద కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా కోర్టు అదే విషయాన్ని స్పష్టం చేసింది.అతడు చేసిన పనికి జరిమానా సరైనదే అని భావించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

మొత్తానికి అతడి వెర్రి తనానికి కోర్టు అతడికి భారీ జరిమానా విధించి అతడి నోరు మూయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube