తన కోరిక తీర్చకపోతే ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరిస్తున్న ప్రియుడు.. చివరకు..  

tamilnadu man karthi extorts money demands sexual favour from exgirlfriend , crime news, sexual favour, ex-girlfriend,Tamilnadu , karthi, extorts, demands, money, social media, photos, videos, arrest - Telugu Arrest, Crime News, Demands, Ex-girlfriend, Extorts, Karthi, Money, Photos, Sexual Favour, Social Media, Tamilnadu, Videos

ఈ మధ్య కొందరు మగవాళ్ళు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు.అమ్మాయిలను సోషల్ మీడియాలో పరిచయం చేసుకోవడం తర్వాత మాయమాటలు చెప్పి వారిని ప్రేమలోకి దింపుతారు.

TeluguStop.com - Man Extorts Money Demands Sexual Favour From Ex Girlfriend

కొన్నిరోజులు ప్రేమిస్తున్నట్లు నటించి వారితో క్లోజ్ గా ఫోటోలు దిగి వాటిని ఆయుధంగా మలుచుకుని అమ్మాయిలతో ఆడుకుంటున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

ఒక యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన ఒక యువతితో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించాడు.అయితే కొన్నాళ్ళు వీరి ప్రేమాయణం బాగానే సాగినా తర్వాత ఆ యువకుడు ఆ అమ్మాయికి బ్రేక్ అప్ చెప్పాడు.

TeluguStop.com - తన కోరిక తీర్చకపోతే ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరిస్తున్న ప్రియుడు.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

తర్వాతే అసలు కథ మొదలయ్యింది.ఆ అమ్మాయిని నా కోరిక తీర్చకపోతే నీ ఫోటోలు, వీడియోలు నెట్ లో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడులోని పుదుచ్చేరి లో కార్తీ అనే యువకుడు నివసిస్తుండేవాడు.

ఆ యువకుడు జులాయిగా తిరుగుతుండేవాడు.అయితే అతడి ఫ్రెండ్ వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసాడు.

అందులో కార్తీ ని కూడా చేర్చాడు.అదే గ్రూప్ లో ఉండే ఒక యువతితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారింది.

తర్వాత ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగారు.వెళ్లిన ప్రతి ప్రదేశంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.కట్ చేస్తే ఏమయ్యిందో ఏమో తెలియదు కానీ కార్తీ ఆ యువతికి బ్రేక్ అప్ చెప్పేసాడు.

ఇద్దరు విడిపోయారు.అయితే కొన్నిరోజులు కార్తీ ఆ యువతి జోలికి వెళ్ళలేదు.

తర్వాత ఒక రోజు ఫోన్ చేసి తన కోరిక తీర్చమని అడగడంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్ అయ్యింది.

అందుకు ఆ యువతి నో చెప్పడంతో కార్తీ తను దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ యువతిని భయపెట్టాడు.

ఆమె వద్ద నుండి 15000 రూపాయలు తీసుకున్నాడు.తర్వాత కొద్దిరోజులకు మళ్ళీ ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరించడంతో ఆ యువతి మళ్ళీ 5000 రూపాయలు ఇచ్చింది.అయితే ఇంతటితో ఆగకుండా ఆ యువతిని బెదిరిస్తూనే ఉన్నాడు.

ఒక రోజు ఫోన్ చేసి మళ్ళీ తన కోరిక తీర్చాలని అంతేకాదు దానితోపాటు 50000 రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసాడు.

లేకపోతే మనిద్దరం కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు మీ తల్లిదండ్రులకు, మీ చెల్లికి పంపుతానని చెప్పడంతో ఇంకా ఇదంతా భరించలేక ఆ యువతి జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

#Arrest #Money #Ex-girlfriend #Social Media #Karthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు