ప్రేయసి కోసం క్వారంటైన్ నుండి జంప్!  

Man Escapes Quarantine Facility For Girlfriend In Tamil Nadu - Telugu Corona Virus, Man Escapes, Quarantine, Tamil Nadu

కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి విదితమే.ఈ వైరస్ బారిన పడకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

 Man Escapes Quarantine Facility For Girlfriend In Tamil Nadu

ఇక ఈ వైరస్ సోకిన వారిని, లక్షణాలు కలిగిన వారిని ఐసోలేషన్ వార్డుల్లో, క్వారంటైన్‌లో పెడుతున్నారు.వారి నుండి ఇతరులకు వైరస్ సోకకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతడిని క్వారంటైన్‌లో పెట్టారు.24 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి రావడంతో అతడిని క్వారంటైన్‌లో పెట్టారు.అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని పారిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అతి కష్టం మీద అతడిని, అతడి ప్రియురాలిని పట్టుకోగలిగారు.

ప్రేయసి కోసం క్వారంటైన్ నుండి జంప్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వారిద్దరినీ తీసుకొచ్చి క్వారంటైన్‌లో పడేశారు.

ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇలా క్వారంటైన్ కేంద్రాల నుండి పారిపోతున్న వారు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.ఇలాంటి వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తు్న్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Escapes Quarantine Facility For Girlfriend In Tamil Nadu Related Telugu News,Photos/Pics,Images..