చావు నోట్లో తలపెట్టిన ప్రబుద్ధుడు.. బతికి బట్టకట్టిన వైనం

కొన్నిసార్లు మనుష్యులు చేసే పనులకు నవ్వాలో బాధపడాలో అర్ధం కాదు.వారు చేసే చేష్టలు వారి ప్రాణాలకు ముప్పని తెలిసినా కూడా వారు ఎందుకు చేస్తారో వారికే తెలియాలి.

 Man Enters Tiger Enclosure And Escapes Death-TeluguStop.com

ఇలాంటి ఘటనే ఒకటి సౌదీ అరేబియాలోని జూలో చోటు చేసుకుంది.రియాద్ జూలో ఉన్న ఓ పులి అడ్డాలోకి పడ్డాడు ఓ యువకుడు.

దీంతో ఆ పులి మనోడి తలను అమాంతం నోట్లోకి లాగేసుకుని తన ఆకలి తర్చుకోవాలని చూసుకుంది.

అసలే ఆకలిపై ఉన్న పులి, మనిషి తన అడ్డాలోకి రావడంతో తనకు ఫుల్ మీల్స్ దొరికిందని సంబరపడిపోయింది.

పులి అడ్డాలో పడ్డ వ్యక్తి తలను అమాంతం నోట్లోకి అందుకుని అతడిపై దాడి చేసింది.దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది పులికి మత్తు మందు ఇచ్చి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు.కాగా అతడిని సూడాన్ నుంచి వలస వచ్చిన మహ్మద్ అబ్దుల్ మోషాన్‌గా అధికారులు గుర్తించారు.

అతడు కావాలనే పులి బోణులోకి దూకాడని అక్కడున్నవారు తెలిపారు.అయితే తాను ప్రమాదవశాత్తు అందులో పడ్డానంటూ చెప్పుకొచ్చాడు ఈ వ్యక్తి.ఏదేమైనా చావు నోట్లో తలదూర్చి బతికిబట్టకట్టి మనోడికి భూమిపై ఇంకా నూకలు ఉన్నాయని అంటున్నారు ఈ ఘటన గురించి తెలుసుకున్నవారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube