దర్జాగా షాప్ లోకి వెళ్లిన వ్యక్తి భయంతో పరుగులు పెట్టడానికి కారణం ఏంటంటే..??

Man Enters The Shop With Courage But Run With Fear What Is The Reason

సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల వీడియోలు మనకి దర్శనం అవుతున్నాయి.ప్రపంచంలో ఏ మూల ఎటువంటి వింత జరిగినా క్షణాల్లో తెలిసి పోతుంది.

 Man Enters The Shop With Courage But Run With Fear What Is The Reason-TeluguStop.com

అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సమయానికే ఆ వీడియోలు కాస్త తెగ వైరల్ అయిపోతున్నాయి.నెటిజన్లు కూడా ఆ వీడియోలను బాగా ఇష్టపడుతూ లైక్స్ మీద లైక్స్ ఇస్తూ షేర్ చేస్తున్నారు.

అందులో కొన్ని ఫన్నీ వీడియోలు అయితే మరికొన్ని మాత్రం భయం తెప్పించేవి, ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.

 Man Enters The Shop With Courage But Run With Fear What Is The Reason-దర్జాగా షాప్ లోకి వెళ్లిన వ్యక్తి భయంతో పరుగులు పెట్టడానికి కారణం ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియో చూస్తే మనకి కూడా భయం వెయ్యడం ఖాయం.

ఒక వ్యక్తి ఎంచక్కా ఫోన్ చూసుకుంటూ ఒక షాప్ లోకి వెళ్లి మళ్ళీ భయం భయంతో బయటకి పరుగులు తీయడం మనం వీడియోలో గమనించవచ్చు.అసలు ఇంతకు ఆ షాప్ లో ఆ వ్యక్తి చూసినది ఏంటి.

ఎందుకు అతను భయంతో బయటకు పరుగులు తీశాడు అనే విషయం ఒకసారి తెలుసుకుందాం.ఈ వీడియోను మనం గమనించినట్లయితే ఒక షాపులోకి ఓ కుర్రాడు ఫోన్ చూసుకుంటూ లోపలికి వచ్చి కూర్చుందామనుకుంటాడు.

కానీ అతను ఒక్కసారిగా షాప్ పైకి చూసి హుటాహుటిన భయంతో షాప్ బయటకి పరుగులు పెట్టాడు.అతడు అక్కడి నుంచి అలా లేచాడో లేదో ఒక్కసారిగా షాప్‌ పైభాగంలో నుంచి ఒక ఎలుక వచ్చి కింద పడింది ఎలుకను తరుముకుంటూ ఒక పెద్ద పామును కూడా మనం వీడియోలో చూడవచ్చు.

వ్యక్తి తల ఎత్తి పైకి చూడగా అతనికి పాము, ఎలుక కనిపించడంతో ఒక్కసారిగా షాప్ నుంచి బయటకు పరుగులు పెట్టాడు అన్నమాట.అయితే ఆ ఎలుక ఎలాగైనా పాము చెర నుండి తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేసి పాముకు కనిపించకుండా దాక్కుంది.షాప్ నుంచి బయటకు వెళ్లిన పాము మళ్ళీ ఎలుక కోసం షాప్ అంతా తిరిగింది.ఈ సంఘటన మొత్తం షాప్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి టైమ్ బాగుండి తప్పించుకున్నాడు కానీ లేదంటే ఆ ఎలుక స్థానంలో అతను పాముకు ఆహారంల మారేవాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

#Sanke #Shop #Animals #Snake Shop #Fear

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube