నా ఆత్మహత్యకు కారణం నువ్వే అంటూ యువకుడి ఆత్మహత్య.! సెల్ఫీ వీడియోలో ఏముందంటే.?       2018-07-03   21:49:03  IST  Raghu V

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తన చావుకు భార్య, అత్త మామలు, బావమరిదే కారణం అని తెలిపాడు ఓ యువకుడు. భార్య, అత్తమామలు, బావమరిది వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల లోకి వెళ్తే..

ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లోని 6వ నంబరు ప్లాట్‌ఫాంపై జరిగింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణలంకకు చెందిన గురువా రెడ్డి భార్య అతనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తన భర్త తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో గురువారెడ్డిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రెండు రోజులు నిర్భంధించారు. జైలు నుంచి బయటకు వచ్చిన గురువారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చెయ్యని తప్పుకు తనను అనవసరంగా స్టేషన్‌లో పెట్టారని సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పాడు.

‘సారీ డాడీ. ఇంతగా బాధపెడతాననుకోలేదు. గాయాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు. ఏమీ చేయని తప్పుకు లోపల(పోలీసు స్టేషన్‌) కూర్చోపెట్టావు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది. నువ్వు ఏముంది హ్యాపీగా ఉన్నావు. నా చావుకు కారణం నువ్వు, మీ అ‍మ్మ నాన్న, మీ అన్నయ్య. వాళ్లు ఎంతగా మోసం చేశారో నీకు తెలుసు. రాత్రికి రాత్రి మాటమార్చెస్తారా. ఎంత పని చేశావు కన్నా. నీకోసం ఎంత చేశానో నీకు తెలుసు. సరే బాయ్‌… ఒక వేళ బతికుంటే మళ్లీ కలుద్దాం.. కిట్టు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.