అయ్యబాబోయ్.. కోతి ఎంత పని చేసింది..ఇలా ఐతే కష్టమే!

ఈ మధ్య చాలా ఊర్లలో కోతుల బెడద ఎక్కువవుతుందని ప్రజలు వాపోతున్నారు.ఇది వరకు పంటలకు మాత్రమే కోతుల వల్ల ఇబ్బందులు వచ్చేవి.

 Man Dies After Brick Flung By Monkey From Second Floor Hits His Head Details, De-TeluguStop.com

కానీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా కోతుల వల్ల ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు.కోతులు రోజురోజుకూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

తాజాగా ఒక కోతి వల్ల ఒక వ్యక్తి తన ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

ఈ ఘటనలో ఆ వ్యక్తి మరణించాడు.

ఇంతకీ ఆ కోతి ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా.ఒక కోతి ఇంటి పైన నుండి ఒక ఇటుకను కిందకు ఇసిరేసింది.

దీంతో ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడు.ఆ వ్యక్తికి ఆ ఇటుక బలంగా తగలడంతో ఆ వ్యక్తి అక్కడే మరణించాడు.

దీంతో ఆ గ్రామాలో విషాదం అలముకుంది.ఈ ఘటన ఢీల్లీ లో చోటు చేసుకుంది.

ఢీల్లీ లో కోతుల బెడద ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఇవేమి కోతులను ఆపలేక పోతున్నాయి.ఢిల్లీ లోని నబికరీం ప్రాంతంలో ఉండే మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తల మీద కోతి ఇటుకను పడేయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మరణించాడు.అయితే ఈ ఘటన పోలీసుల వరకు వెళ్లడంతో వాళ్ళు విచారణ జరిపారు.

Telugu Delhi, Delhinabikareem, Brickflung, Mohammad Kurban, Monkey, Om Prakash-L

ఈ విచారణలో అసలు విషయం బయటకు వచ్చింది.ఆ ఇటుక పడిన ఓం ప్రకాష్ అనే యజమానిని ప్రశ్నించగా అతడు కోతుల వాటర్ ట్యాంక్ మూత తీస్తున్నాయని అందుకే ట్యాంక్ పైన ఇటుకలు పెట్టానని చెప్పారు.దీంతో ఆ మేడ మీదకు వచ్చిన కోతి ఆ ఇటుకను నెట్టినట్టు పోలీసుల విచారణలో నిర్దారణ అయ్యింది.

ఆ ఇంటి యజమాని నిర్లక్యం కారణంగానే ఈ ఘటన జరగడం వల్ల ఓం ప్రకాష్ మిశ్రా మీద కేసు నమోదు చేసారు.

ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.కోతుల నుండి రక్షణ కోసం పెట్టుకున్న ఆ ఇటుకలు వల్ల ఒక మనిషి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube