వామ్మో.. ఆ హోటల్‌లో ఆహారమంతా ఆ మనిషి గంటలో తినేశాడు!

మనలో కొందరు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టపడతారు.ఆ ఛాలెంజ్ కోసం ఎంత దూరమైనా వెళతారు.

 Man Eats Entire Restaurant Menu In 60 Minutes, Raising Cash For Charity, Man, R-TeluguStop.com

తాజాగా ఒక వ్యక్తి అలా ఒక ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ ను తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు.ఒక హోటల్ లో వండిన ఆహారాన్నంతా తక్కువ సమయంలోనే తినేసి విరాళాలను సంపాదించాడు.

కేవలం గంట సమయంలో వండిన ఆహారాన్నంతా తినేయడంతో ఆ వ్యక్తి టాలెంట్ కు హోటల్ సిబ్బందితో పాటు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే కొన్ని నెలల క్రితం 22 సంవత్సరాల వయస్సు గల యూకేలోని సుందర్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన కైల్ గిబ్సన్ అనే వ్యక్తి బ్రిటీష్ ఈటింగ్ లీగ్‌లో పాస్ అయ్యాడు.

ఒక మంచి పని కోసం విరాళాలు సేకరించాలనే ఆలోచన రావడంతో యువకుడు అందుకోసం తనకు ఎంతో ఇష్టమైన ఈటింగ్ నే నమ్ముకున్నాడు.మెనూలో ఉన్న అన్ని వంటకాలను 60 నిమిషాల్లో తినేసి హోటల్ సిబ్బందితో పాటు స్థానికులను సైతం ఆశ్చర్యపరిచాడు.

చారిటీకి విరాళాలు సమకూర్చేందుకు కైల్ చేసిన ఈ పనిని నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.కైల్ హోటల్ లోని మిల్క్ షేక్ లు, బర్గర్లు, హాట్ డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్ విచ్ లను గంటలోపే లాగించేశాడు.

యువకుడి టాలెంట్ చూసి కొందరు నెటిజన్లు ఆ యువకుడు మనిషా….? బకాసురుడా….? అని కామెంట్లు చేస్తున్నారు.కైన్ ఒక్కడే 13 వేల కేలరీల ఆహారాన్ని లాగించేయడం గమనార్హం.

కైన్ తన కష్టంతో ఇండియన్ కరెన్సీలో 39,000 రూపాయలను సంపాదించగలిగాడు.ప్రస్తుతం యూట్యూబ్ లో కైన్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube