అమెజాన్ కు చుక్కలు చూపించిన అమెరికన్....చివరికి...

ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థగా పేరొందిన అమెజాన్ అనతికాలంలోనే టాప్ ప్లేస్ కు చేరుకుంది.తమ సంస్థ ద్వారా లక్షల రకాల వస్తువులను ఆన్లైన్ లోనే ఎంచుకుని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించే అమెజాన్ , ఒక వేళ ఎప్పుడైనా తమ సంస్థ నుంచీ కొనుగోలు చేసిన వస్తువులలో ఎలాంటి తేడాలు వచ్చినా వాటిని రిటర్న్ విధానం ద్వారా తీసుకుని నాణ్యమైన వస్తువులను పంపుతుంది.

 Man Defrauded Amazon Of Nearly $290k In Return Scheme,hudson Hamrick , Amazon, R-TeluguStop.com

అయితే అమెజాన్ కల్పించిన ఈ అవకాశాన్ని స్వార్ధానికి వాడుకున్న ఓ అమెరికన్ భారీ మోసానికి పాల్పడ్డాడు.ఒకటి కాదు రెండు కాదు దాదాపు 2 లక్షల పైగా అమెజాన్ కు నష్టం వాటిల్లేలా చేశాడు.

వివరాలలోకి వెళ్తే…

అమెరికాకు చెందిన హ్యామ్రిక్ అనే వ్యక్తి గడిచిన ఐదేళ్ళుగా అమెజాన్ లో అత్యంత విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు.అయితే తాను కొనుగోలు చేసిన వస్తువులు వచ్చిన ప్రతీ సారి అవి చాలా చీప్ క్వాలిటీ వస్తువులు అంటూ తిప్పి పంపేసేవాడు.ఇలా దాదాపు 300 వస్తువులు అతడు కొనుగోలు చేయగా అందులో 270 వస్తువులు రిటర్న్ పెట్టాడని, వాటిలో 250 వస్తువులు గతంలో పెట్టిన ధరకంటే ఎక్కువ మొత్తంలో రిటర్న్ ఇచ్చారని, వాటి మొత్తం విలువ 2.90 లక్షలు ఉంటాయని అమెజాన్ నిపుణులు కనుగొన్నారు.

హ్యామ్రిక్ వస్తువులు వచ్చిన తరువాత అవి బాలేదని వెంటనే రిటర్న్ పెట్టడం రిటర్న్ ఇచ్చే సమయంలో పాత వస్తువులు ఇవ్వడం జరిగేదని వాటి సీరియల్ నెంబర్ లను పరిశీలిస్తే అవి పూర్తిగా అమెజాన్ పంపే వస్తువుల సీరియల్ నెంబర్ కు సరిపడేవి కావని అమెజాన్ తరపు లాయర్లు కోర్టులో వాదించారు.ఎంతో అధునాతన వస్తువులను సైతం చాలా చెత్త వస్తువులుగా పేర్కొనేవాడని, రిటర్న్ చేయడానికి వారం రోజులు ఉందనగా వాటిని అమ్మేసేవాడని లాయర్లు తెలిపారు.

ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగే టప్పుడు ఎప్పుడూ అమెజాన్ అలెర్ట్ గా ఉంటుందని, ఇలాంటి వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.కాగా అమెజాన్ తరుపు వాదనలు విన్న కోర్టు హ్యామ్రిక్ కు 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు తాను మోసం చేసిన డబ్బు అమెజాన్ కు కట్టేయాలని తీర్పు చెప్పింది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube