విడ్డూరం : మద్యప్రదేశ్‌లో చిరంజీవి 'ఠాగూర్‌' సీన్‌, ఇంతకంటే దారుణం మరేం ఉండదు

మెస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమాలో ఒక సీన్‌ కామెడీగా అనిపించినా ప్రస్తుతం పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

 Man Declared Dead By Doctors Found Alive In Morgue Next Morning-TeluguStop.com

ప్రస్తుతం ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వ్యవహరిస్తున్న తీరుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నట్లుగా అందులో ఉంది.ఆ సినిమా ఒక వ్యక్తి చనిపోయినట్లుగా ప్రభుత్వ వైధ్యులు సర్టిఫికెట్‌ ఇస్తే ప్రైవేట్‌ హాస్పిటల్‌ వారు శవానికి చికిత్స చేసి హల్‌ చల్‌ చేయడం చూశాం.

ఆ తర్వాత అతడు చనిపోయినట్లుగా నిర్ధారించారు.అయితే మహారాష్ట్రలో ఠాగూర్‌ సినిమా సీన్‌కు కాస్త అటు ఇటుగా జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర జిల్లా సివిల్‌ హాస్పిటల్‌లో సాగర్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో చికిత్సకు జాయిన్‌ అయ్యాడు.ఆయన చనిపోయినట్లుగా వైధ్యులు నిర్ధారించారు.చనిపోయినట్లుగా డెత్‌ సర్టిఫికెట్‌ కూడా రావడంతో గురువారం సాయంత్రం పోస్ట్‌మార్టంకు సిద్దం అయ్యారు.అయితే అప్పటికే ఆలస్యం అవ్వడంతో పోస్ట్‌ మార్టంను తెల్లారికి వాయిదా వేయడం జరిగింది.

శుక్రవారం ఉదయం పోస్ట్‌మార్టంకు అంతా సిద్దం చేశారు.శవంను తీసుకు వచ్చి ఫార్మాల్టీస్‌ను పూర్తి చేస్తున్న సమయంలో చనిపోయాడనుకున్న సాగర్‌ లేచి కూర్చున్నాడు.

విడ్డూరం : మద్యప్రదేశ్‌లో చిర

సాగర్‌ లేచి కూర్చోవడంతో అంతా అవాక్కయ్యారు.చనిపోయాడనుకున్న సాగర్‌ ఎలా లేచాడంటూ అంతా భయాందోళనకు గురవుతున్న సమయంలో డాక్టర్‌ చెక్‌ చేసిన సమయంలో పొరపాటు పడ్డట్లుగా వెళ్లడయ్యింది.ప్రభుత్వ డాక్టర్‌ అలసత్వం కారణంగా ఒక నిండు ప్రాణం పోయేది అంటూ స్థానికులు మరియు సాగర్‌ బంధు మిత్రులు హాస్పిటల్‌ ముందు ఆందోళనకు దిగారు.ఇలాంటి వారి వల్లే ప్రభుత్వ హాస్పిటల్స్‌ అంటేనే జనాలు భయపడుతున్నారు.

ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుందో.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube