సీఎం కేసీఆర్ ఇంటి ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!  

Man, suicide, CM KCR, house, police - Telugu Cm Kcr, House, Man, Police, Suicide

గతంలో తెలంగాణ కోసం చాల మంది వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుంటాయని ఎన్నో కలలు కన్నారు.

TeluguStop.com - Man Commits Suicide In Front Of Cm Kcrs House

సొంత రాష్ట్రంలో మంచి జాబ్, సొంత ఇల్లుతో మంచిగా బ్రతకవచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ వారి ఆశలు ఆవిరైపోయాయి.

మొన్న ఓ వ్యక్తి రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పిడిన సంగతి అందరికి తెలిసిందే.ఆ ఘటన మరవక ముందే మరో ఘటన సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్‌ వద్ద చోటు చేసుకుంది.

TeluguStop.com - సీఎం కేసీఆర్ ఇంటి ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం..-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్‌ గేటు వద్ద ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది.వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఆటో డ్రైవర్ ని అడ్డుకున్నారు.

అయితే వ్యక్తి కిరోసిన పోసుకొని నిప్పు అంటించుకున్న సమయంలో పోలీసులు అతనిపై నీళ్లు పోసి కాపాడారు.అంతేకాదు ఈ వ్యక్తి తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు.

ఇక రాష్ట్రం వచ్చిన తరువాత కూడా అతనికి సొంత ఇల్లు కల నెరవేరలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఆటో డ్రైవర్.పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

#House #CM KCR #Police #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Commits Suicide In Front Of Cm Kcrs House Related Telugu News,Photos/Pics,Images..