ఆన్ లైన్ లో ఆటలాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు...

ఈ మధ్య కాలంలో కొందరు ఆన్ లైన్ లో ఆటలు ఆడితే డబ్బులు సంపాదించవచ్చని అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించవచ్చని తన స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ ఆన్ లైన్ లో ఆటలు చివరికి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

 Man Commits Suicide For Online Money Loss In Hyderabad-TeluguStop.com

వివరాల్లోకి వెళితే జగదీష్ అనే యువకుడు స్థానిక నగరంలోని ఎల్బి నగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేకపోవడంతో ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు.

 ఈ క్రమంలో ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించే ఉపాయం పన్నాడు.దీంతో మొదట్లో బాగానే డబ్బులు సంపాదించినప్పటికీ క్రమక్రమంగా ఆన్ లైన్ గేమ్స్ కి బానిసయ్యాడు.

 Man Commits Suicide For Online Money Loss In Hyderabad-ఆన్ లైన్ లో ఆటలాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 దీంతో సంపాదించుకున్న డబ్బులు అయిపోవడంతో పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకునేందుకు అత్యాశకు పోయి తన స్నేహితులు మరియు బంధువులు ద్వారా దాదాపుగా 15 లక్షలకు పైగా అప్పులు చేసి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడాడు.కానీ ఆ డబ్బు కూడా పోవడంతో చేసేదేమీలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.దీంతో పోలీసులు ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ కొంతమంది పలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి సూచిస్తున్నారు.

#Hyderabad #ManCommits #Jagadeesh #Online Games

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు