ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు.ఆంధ్రప్రదేశ్ రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
కరోనాతో చనిపోయే వారికంటే కరోనా భయంతో చనిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.ఏదో జరిగిపోతోందన్న భయాందోళనతో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు.తాజాగా కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే.
గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.తన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్లిష్ట సమయంలో జీవనోపాధికి అతడే ఇంటికి జీవనాధారం.అతని సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది.
అయితే ఆ వ్యక్తికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించి టెస్ట్ చేయించుకున్నాడు.నిర్దారణ పరీక్షలో అతనికి పాజిటివ్‌గా తేలింది.వెంటనే ఆరోగ్య సిబ్బంది అతన్ని తాడేపల్లి సమీపంలోని గుండిమెడలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.వైరస్ సోకిందని తీవ్ర మనస్థాపానికి గురైన కాంపౌండర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
క్వారంటైన్ కేంద్రంలోనే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కవగా నమోదు కావడంతో అక్కడ అధికారులు లాక్ డౌన్ విధించారు.
దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యాయి.కరోనా బారిన పడకుండా మాస్కులు, సామజిక దూరం పాటించాలని సూచించారు.
కరోనా వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవగాహన కార్యక్రమాలు చెప్పటారు.అంతేకాకుండా కరోనా వచ్చిన కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని అధికారులు తెలియజేస్తున్నారు.