కరోనా రోగిపై వివక్ష చూపటంతో వ్యక్తి ఆత్మహత్య..!

ప్రభుత్వం ‘పోరాడాల్సింది రోగితో కాదు వైరస్ తో’ అని చాలా సార్లు చెప్పి ఉంటుంది.కరోనా సోకిందని తెలిస్తే చాలు ఆ వ్యక్తితో మాట్లాడటమే నేరంగా భావిస్తున్నారు కొందరు.

 Ananthapuram, Corona Peshent, Suicide-TeluguStop.com

మరికొందరూ కరోనా సోకిందని సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు.మాటలు హద్దు దాటి ప్రాణాలే తీసుకుంటున్నారు కొందరు బాధితులు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కరోనా గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.అయినా కొందరిలో మార్పు రావడం లేదు.కరోనా సోకిందని తెలిస్తే దూరంగా పరిగెత్తుతున్నారు.రోగితో మాట్లాడటం కానీ.

కుటుంబసభ్యులతో మాట్లాడానికి జంకుతున్నారు.వారికి సన్నిహితంగా ఉన్న వారిని చూసినా భయంతో వణికిపోతూ దూరం జరుగుతున్నారు.

రోగితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా బాధితులుగానే ట్రీట్ చేస్తున్నారు.దగ్గరికి వచ్చినా వెలివేస్తున్నారు.

ఇలాంటి అమానుష ఘటన అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతరపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడుతున్నాడని గ్రామస్తులు దూరం పెట్టారు.సూటి పోటి మాటలు మాట్లాడారు.

భరించలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ముప్పులకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి ఐదు రోజులు కిందట మరణించాడు.

అతడు చనిపోక ముందు అదే గ్రామానికి చెందిన చాకలి నాగన్నతో కరోనా బాధితుడు మాట్లాడిన విషయం గ్రామస్తులకు తెలిసింది.దీంతో నాగన్నకు కూడా కరోనా ఉందని స్థానికులు దూరం పెట్టారు.

సూటీపోటీ మాటలతో దూషించడం మొదలు పెట్టారు.

రానురాను వీరి మాటలు హద్దుల దాటాయి.

నీకు కరోనా వచ్చింది అంటూ మానసికంగా హించించేవారు.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన చాకలి నాగన్య కల్యాణదుర్గం రోడ్డులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు.

తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అది గమనించి పశువుల కాపరి అంబులెన్స్ కు సమాచారం అందించాడు.

దీంతో అతడిని కల్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకెళ్లినా మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.బాధితుడి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కేసు దర్యాప్తులో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube