పని మనిషి వేసిన వలలో చిక్కుకున్న యజమాని.. ఆమె చేసిన పనితో ఆత్మహత్య యత్నం  

Man Commits Suicide Because Of Illegal Affair-suicide,video,పనిమనిషి,బ్లాక్‌ మెయిల్‌

కేరళలోని తిరుమన్నియూర్‌లో మనోజ్‌ కుమార్‌ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. భార్య పిల్లలతో అతడు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు..

పని మనిషి వేసిన వలలో చిక్కుకున్న యజమాని.. ఆమె చేసిన పనితో ఆత్మహత్య యత్నం-Man Commits Suicide Because Of Illegal Affair

వారి సుఖ సంసారంలోకి పని మనిషి విలన్‌లా ఎంట్రీ ఇచ్చింది. భార్య భర్తలు ఇద్దరు కూడా జాబ్‌లు చేస్తున్న కారణంగా పనిమనిషిని పెట్టుకున్నారు. ఆ పనిమనిషికి వస్తున్న సాలరీ కంటే మరింత ఆదాయం కావాలనిపించింది.

అందుకు యజమానిని బుట్టలో వేసుకుంది. సుఖంతో పాటు, యజమాని నుండి డబ్బు కూడా వస్తూ ఉండటంతో దాన్ని కంటిన్యూ చేసింది.

ఇటీవల సమ్మర్‌ సెలవుల కారణంగా మనోజ్‌ కుమార్‌ భార్య తన పిల్లలతో కలిసి ఊరు వెళ్లింది.

సమ్మర్‌ హాలీడేస్‌కు ఆమె ఊరు వెళ్లడంతో అతడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పనిమనిషితో అదే పనిగా రొమాన్స్‌లో మునిగి తేలాడు. చుట్టు పక్కల ఏం జరుగుతుందనే విషయం కూడా అతుడు పట్టించుకోవడం లేదు.

ఇదే అదునుగా పనిమనిషి తన నీచపు బుద్దిని బయట పెట్టింది. తనకు మరింత డబ్బు కావాలనే ఉద్దేశ్యంతో మనోజ్‌ కుమార్‌ కిరాయికి ఉంటున్న ఇల్లు యజమానితో మాట్లాడి తామిద్దరం శృంగారంలో ఉన్న సమయంలో వీడియో తీయాల్సిందిగా కోరింది.

పనిమనిషి చెప్పిన ప్లాన్‌కు ఓకే అన్న ఇంటి యజమాని వారిద్దరు శృంగారంలో ఉన్న సమయంలో వీడియో తీశాడు. ఆ వీడియోను మనోజ్‌ కుమార్‌కు పంపి బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టారు.

రెండు లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలని, లేదంటే వెంటనే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బెదిరించాడు. తన వద్ద అంత డబ్బు లేదని మనోజ్‌ కుమార్‌ అనగా చెక్‌ అయినా ఇవ్వమంటూ డిమాండ్‌ చేశారు..

తన జీవితం మరీ ఇలా తయారు అయ్యిందేంటి అంటూ బాధపడ్డ మనోజ్‌ కుమార్‌ చేసేది లేక ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే అదృష్టవశాత్తు మనోజ్‌ కుమార్‌ బతికి బయట పడ్డాడు.

ఈ విషయం అందరికి తెలియడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.