ఫైవ్ స్టార్ హోటల్ లో ఆత్మహత్య... సూసైడ్ నోట్ లో పాట  

Man Commits Suicide At Five-star Hotel Room In Delhi-five-star Hotel Room,man Commits Suicide,suicide Letter

ఈ మధ్య కాలంలో యువతరం చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.వారిలో పెరిగిపోయిన ఆత్మన్యూనత, తల్లిదండ్రుల పెంపక లోపం కారణంగా, చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేకపోతున్నారు.

Man Commits Suicide At Five-star Hotel Room In Delhi-Five-star Man Letter

తాము ఒంటరి అనే ఫీలింగ్ తో ఆత్మహత్య వరకు వెళ్ళిపోతున్నారు.అయితే ఇలా చనిపోయే సమయంలో కొందరు విచిత్రంగా చనిపోతారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే ఇప్పుడు అతను చేసిన పని కాస్తా ఆశ్చర్యానికి గురి చేసింది.


స్థానికంగా ఉన్న ఓ ఫైవ్ స్టార్‌లో హోటల్‌లో జనవరి 19న అతడు దిగాడు.అయితే అతడున్న గది నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది అప్రపత్తమయ్యారు.

తలుపు తట్టినా ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకి సమాచారం అందించి గది తలుపు తీశారు.బెడ్ పై యువకుడు పడి ఉండటం చూసి చనిపోయాడని నిర్ధారించుకున్నారు.

అతను చనిపోయిన ప్రదేశంలో నిద్రమాత్రలు, సూసైడ్ నోట్ దొరికింది.అయితే ఆ సూసైడ్ నోట్ లో అతను చనిపోవడానికి గల కారణాలు లాంటివి రాయకుండా లింకిన్ పార్క్ పాటల లిరిక్స్ రాసుకున్నాడు.

అసలు సాంగ్ లిరిక్స్ రాయడానికి గల కారణాలు ఏంటి అనేది పోలీసులకి కూడా అర్ధం కాలేదు.అతని దగ్గర లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు.

అయితే దొరికిన సూసైడ్ నోట్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

.

తాజా వార్తలు

Man Commits Suicide At Five-star Hotel Room In Delhi-five-star Hotel Room,man Commits Suicide,suicide Letter Related....