బతకడం ఇష్టంలేక.. చచ్చిపోవాలని ఫ్లై ఓవర్ ఎక్కిన ఓ వ్యక్తి.. చివరికి పోలీసులు ఏమి చేశారంటే..!?

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సర్వ సాధారణం.మారిన జీవన విధానంలో కొందరికి ఆర్థిక కష్టాలు, ఇంకొందరికి కుటుంబ సమస్యలు, మరికొందరికి మానసిక ఒత్తిడి .

 Man Climbs The Fly Over To Suicide What Did The Police Do, Viral Latest, Viral N-TeluguStop.com

ఇలా సమస్యలు, కష్టాలు వస్తూనే ఉంటాయి.అలా అని అందరూ చావే గతి అనుకుంటే ఈ భూమ్మీద మనుషులే ఉండరు.

అయినా కొంత మంది కష్టాలు, సమస్యలు భరించలేక చావే శరణ్యమని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.అలాగే ఆలోచించాడు ఓ వ్యక్తి.తనకి కష్టాలు ఉన్నాయని, బతకడం ఇష్టంలేదని, చచ్చిపోతానని ఫ్లై ఓవర్ ఎక్కాడు.ఈ ఘటన ఢిల్లీ లో జరిగింది.

సెప్టెంబర్ 12న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.ఉత్తరాఖండ్ లోని ఆల్మోరాకు చెందిన ఓ వ్యక్తి (42) ఢిల్లీలోని ఆండ్రూ గంజ్ ఫ్లై ఓవర్ పైనుంచి దూకి చనిపోవాలని సెప్టెంబర్ 12న సాయంత్రం 6 గంటల సమయంలో ఫ్లై ఓవర్ ఎక్కాడు.

అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కిందకు దిగమని చెప్పారు.అయితే ఆ వ్యక్తి తనకు బతకడం ఇష్టం లేదని, చచ్చిపోతానని, కిందకు దిగనని గట్టిగా అరిచి చెప్పాడు.

దీంతో పోలీసులు పొరపాటున దూకేస్తాడేమోనని ముందు జాగ్రత్తగా నెట్ తీసుకొచ్చి పట్టుకున్నారు.చివరికి పోలీసులు వారి మాటలతోనే ఆ వ్యక్తి కి మంచి మాటలు చెప్పి , జీవితం విలువ తెలిసేలా నచ్చజెప్పి కిందకి దిగి వచ్చేలా చేశారు.చనిపోవాలనుకున్న ఆ వ్యక్తి పేరు జగత్ సింగ్ బిస్త్ అని, ఢిల్లీలోని హుజ్ కాస్ ప్రాంతంలో నివసించే వాడని తెలిపారు.

కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆ వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకుని ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube