విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిల ట్రాప్! అడ్డంగా దొరికిపోయాడు  

Man Cheats Girls Saying He Is Actor Vijay Deverakonda - Telugu Actor Vijay Deverakonda, Cyber Crimes, Man Cheats Girls, Tollywood

టాలీవుడ్ లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు.అతని క్రేజ్ ని కొంత మంది సోషల్ మీడియాలో అమ్మాయిలని ట్రాప్ చేయడానికి వాడుకుంటున్నారు.

Man Cheats Girls Saying He Is Actor Vijay Deverakonda

బేసిక్ గా తమకి పలానా హీరో తెలుసు, అతను తనకి మంచి ఫ్రెండ్ అని చెబితే అమమయిలు ఈజీగా నమ్మేస్తూ ఉంటారు.అలాగే సోషల్ మీడియాలో ఒక ఫేక్ ఎకౌంటు క్రియేట్ చేసి విజయ్ దేవరకొండ పేరుతో అమమయిలతో చాటింగ్ చేస్తూ వారిని ట్రాప్ చేస్తున్న ఓ వ్యక్తిని హీరో టీంకి ఈ విషయం తెలియడంతో వారు రివర్స్ లో అమ్మాయిల పేరుతోనే వాడిని ట్రాప్ చేశారు.

అతనికి తెలిసిన అమ్మాయితో ఫోన్ చేయించి అతను చెప్పిన మాటలు అన్ని నమ్మినట్లు నటించి తనకు తానుగా హైదరాబాద్ వచ్చేలా చేశారు.

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిల ట్రాప్ అడ్డంగా దొరికిపోయాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

కట్ చేస్తే హైదరాబాద్ లో వాడిని పోలీసుల సాయంతో విజయ్ దేవరకొండ టీం పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఆ వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతకి చెందిన వాడుగా గుర్తించారు.అతను కేవలం విజయ్ దేవరకొండని మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోల మహిళా అభిమానులలో పది మంది వరకు ట్రాప్ చేసి మోసాలకి పాల్పడినట్లు గుర్తించారు.

దీంతో పోలీసులు సదరు మోసగాడికి వారి స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు.ఇకపై హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ ఐడీల నుండి మెసేజ్‌లు వచ్చినా ఎవరూ నమ్మొద్దని విజయ్ ఆఫీస్ టీమ్ తెలియజేసింది.

సోషల్ మీడియా ప్రభావంతో అమ్మాయిలు తమతో చాటింగ్ చేస్తున్నది నిజంగా ఎవరో తెలుసుకోలేని స్థాయిలోకి వచ్చేసారని ఇలాంటి సంఘటనలు చూసినపుడు అర్ధమవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Cheats Girls Saying He Is Actor Vijay Deverakonda Related Telugu News,Photos/Pics,Images..

footer-test