ప్రేమించి పెళ్లి చేసుకున్నారు...! చివరికి ఫోన్ వచ్చిందని ఆ భర్త ఏం చేసాడో తెలుసా.?

ప్రేమించుకున్నారు…జీవితాంతం కలిసి ఉంటాము అనుకోని పెళ్లి చేసుకున్నారు.కానీ చివరికి తల్లి దగ్గరనుండి ఫోన్ రాగానే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు.

 Man Cheated Girl In The Name Of Love-TeluguStop.com

ఈ ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళ్తే.

నెల్లూరుకు చెందిన కర్రా ఆశాజ్యోతి కావలి ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలో చదువుతుంది.చిత్తూరులో చదువుతున్న అల్లూరు పంచాయతీ రాయపేటకు చెందిన దాసరి విజయ్‌కుమార్‌ స్నేహితుడి ద్వారా ఆశాజ్యోతి కి పరిచయమయ్యాడు.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.పెద్దలు ఒప్పుకోకపోవడంతో ద్దలను ఎదిరించి పోలీసులను ఆశ్రయం పొంది నెల్లూరులోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.

వీరు చిత్తూరులోనే కాపురం పెట్టారు.నెల్లూరుకు వచ్చిన తరువాత వారి వివాహాన్ని చట్టపరంగా రిజిస్టరు చేసుకున్నారు.ఇంతలో తన తల్లి రమ్మని ఫోన్ చేసింది…వెళ్లి వచ్చేస్తాను అంటూ భార్యకి చెప్పి అతను వెళ్ళాడు.తరువాత ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసాడు.అతని స్నేహితులకి ఫోన్ చేసింది ఆశ జ్యోతి, ఒకొక్కరు ఒకో సమాధానం ఇచ్చారు.ఎప్పటికీ రాకపోయే సరికి తన బంధువులను తోడుగా తీసుకొని రాయపేటకు చేరుకుంది.

అక్కడి విజయ్‌కుమార్‌ నానమ్మ, తాతయ్య లను తన భర్త గురించి అడుగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆవేదనకు గురైన ఆశాజ్యోతి ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.దీనిని గమనించిన బంధువుల ఆమెను అడ్డుకున్నారు.

ఈ ఘటనపై సంబంధించి ఆశాజ్యోతి మాట్లాడుతూ…న తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించేశారని ఇటు చూస్తే భర్త కనపడకుండా తనను మోసం చేశాడని తనకు న్యాయం చేసి తన భర్తను అప్పగించకపోతే తాను ఆత్మ హత్య చేసుకోవడమే దారి అని ఆవేదన చెందింది.బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube