దేవుడా: ఉమ్ము తో చపాతీలు తయారు చేసిన యువకుడు.. చివరకు..?!

నిన్నటినుంచి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తూ నెటిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.ఆ వీడియోలో ఒక వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మి వేస్తున్నాడు.

 Man Caught Spitting On Rotis Up Wedding-TeluguStop.com

అయితే ఈ వీడియోని చాలామంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ దుర్మార్గుడిని కచ్చితంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేశారు.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.తమ ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి రోటీలు తయారుచేయాలని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి చెందిన కుటుంబ సభ్యులు ఓ స్థానిక హోటల్ కి క్యాటరింగ్ ఇచ్చారు.

అయితే ఆ హోటల్లో పని చేస్తున్న నౌషద్ అనే ఒక వ్యక్తి రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మి వేసాడు.దీనికి సంబంధించిన వీడియో ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో నౌషద్ చేసే చెత్త పని వెలుగులోకి వచ్చింది.

 Man Caught Spitting On Rotis Up Wedding-దేవుడా: ఉమ్ము తో చపాతీలు తయారు చేసిన యువకుడు.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో తెగ వైరల్ కావడంతో పోలీసుల దృష్టిలో కూడా పడింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగి పెళ్లి వేడుకలు జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు అన్నీ తెలుసుకొని కేటరింగ్ ఇచ్చిన హోటల్ అడ్రస్ కనుక్కున్నారు.

అనంతరం హోటల్ కి వెళ్లి చపాతీలు తయారు చేసిన వ్యక్తి నౌషద్ అని తెలుసుకున్నారు.ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అయితే తనకి అసలు చపాతీలు చేయడమే రాదని తాను ఎప్పుడూ చపాతీలు చేయలేదని నౌషద్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.దీంతో పోలీసులు నాలుగు దెబ్బలు వేసి వైరల్ అయిన వీడియో చూపించడంతో నౌషద్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది.

ఐతే నౌషద్ ని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది.దీంతో నెటిజనులు తగిన శాస్తి జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే నౌషద్ లాంటి నీచపు మనుషులు చాలా మంది ఉన్నారు.తాగే టీ గ్లాసులలో ఉమ్మి వేయడం, పార్సిల్ చేసే ప్రతి ఫుడ్ ఐటమ్స్ లలో ఉమ్మివేయడం వంటి దుర్మార్గపు పనులు చేసి ప్రజల ఆగ్రహానికి గురైన వారు ఎందరో ఉన్నారు.

ఇలాంటి వాటికి సంబంధించిన ఎన్నో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

#Viral Video #UttarPradesh #ManSpitting #Chapathi Making #Tea Glass

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు