ప్రేయసికి లవ్ ప్రపోజ్ కోసం వీడియో గేమ్ డిజైన్... 9 నెలల కష్టం

ప్రపంచంలో ప్రేమికులు తమ ప్రేమని వ్యక్తం చేసుకోవడానికి చాలా విభిన్నంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఈ మధ్య కాలంలో ఏదో ఫ్లవర్, లేదంటే లవర్ లెటర్, లేదంటే ఒక మెసేజ్ తో ప్రియురాలికి ప్రేమ విషయం సింపిల్ గా చెప్పేద్దామని ఎవరు అనుకోవడం లేదు.

 Man Builds Video Game To Propose To His Girlfriend-TeluguStop.com

ఏదైనా కొత్తగా చేసి ఎవరు చెప్పని విధంగా డిఫరెంట్ గా ప్రపోజ్ చేసి తన ప్రేమని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.దాని కోసం ఎంత కష్టమైన పడుతున్నారు.

తాజాగా అమెరికాకి చెందిన ఓ యువకుడు తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయడానికి కాస్తా విభిన్నంగా ప్లాన్ చేశాడు.ఆమె కోసం ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఏకంగా తొమ్మిది నెలలు కష్టపడి ఒక వీడియో గేమ్ తయారు చేసి ఆమెకి ప్రపోజ్ చేశాడు.

అమెరికాకు చెందిన డెనిస్ వేల్స్ అనే యవకుడు 8 ఏళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.వారిద్దరి మధ్య అల్లుకున్న ఆ బంధాన్ని జీవితకాలం గుర్తిండిపోయేలా ఆమెకు పరిచయం చేయాలనుకున్నాడు.

లైఫ్ టైం తన ప్రేమ గుర్తుండి పోవాలని అమెరికాకు చెందిన వేల్స్ ఆలోచించాడు.పిక్సెల్ ఆర్ట్ నేర్చుకొని వీడియో గేమ్ తయారు చేశాడు.ఆ గేమ్‌లో స్టేజ్‌ల వారీగా దాటుకుంటూ వస్తే చివరికి ప్రపోజ్ చేసేలా డిజైన్ చేశాడు.ఆ వీడియో గేమ్ తయారు చేసి తన ప్రేయసిని కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి వీడియోలో ఉన్న అమ్మాయి నువ్వే అని చెప్పడంతో ఆమె చాలా సంతోషంతో పొంగిపోయింది.

గేమ్ చివరిలో ‘ల్ యూ మ్యారీ మీ అని రాగానే ఆమె ఫిదా అయిపోయిన ఆనందంతో అతన్ని కౌగిలించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube