పాపం : పాప్‌కార్న్‌ అమ్మే వ్యక్తి విమానం తయారు చేశాడు, కాని అధికారులు ఎగరనివ్వలేదు  

Man Builds Homemade Plane Then Uses Road As Runway To Take Off-pak Popcorn Seller,pakistani Man,పాప్‌కార్న్‌ అమ్మే వ్యక్తి,విమానం తయారు చేసిన ఫయాజ్‌

 • తెలివి ఉన్న వారికి ఆర్థిక తోడ్పాటు ఉండదు, ఆర్థికంగా ఉన్న వారికి తెలివి ఉండదు అని పెద్దలు అంటూ ఉంటారు. ప్రతిభ ఉన్న వారు ఎంతో కష్టపడి ఏదో ఒక అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకునే వారు కూడా చాలా మందే ఉంటారు.

 • పాపం : పాప్‌కార్న్‌ అమ్మే వ్యక్తి విమానం తయారు చేశాడు, కాని అధికారులు ఎగరనివ్వలేదు-Man Builds Homemade Plane Then Uses Road As Runway To Take Off

 • ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ముందుకు రాకపోగా, వారిని కిందికి లాగేసేలా చేస్తారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి విమానం తయారు చేశాడు.

 • పాప్‌ కార్న్‌ అమ్ముకునే వ్యక్తి ఏకంగా విమానం తయారు చేసి ఒక గొప్ప అద్బుతాన్ని ఆవిష్కరించాడు. కాని అక్కడి పోలీసులు మరియు అధికారులు మాత్రం ఆ విమానం ఎగరనివ్వలేదు.

 • పూర్తి వివరాల్లోకి వెళ్తే… పాకిస్థాన్‌లోని పక్పాట్టన్‌కు చెందిన మహమ్మద్‌ ఫయాజ్‌ పగటి పూట పాప్‌ కర్న్‌ అమ్ముకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుండి విమానం నడపాలనే కోరిక, గాల్లో ఎగరాలనే కోరికతో సొంతంగా విమానం తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

 • అందుకోసం తాను కూడబెట్టుకున్న డబ్బు, మరియు తన స్థిరాస్థి అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు, బ్యాంకు నుండి కొంత మొత్తంలో లోన్‌గా తీసుకున్నాడు. మొత్తాన్ని కలిపి సింగిల్‌ సిట్టర్‌ విమానంను తయారు చేయడం జరిగింది.

 • Man Builds Homemade Plane Then Uses Road As Runway To Take Off-Pak Popcorn Seller Pakistani పాప్‌కార్న్‌ అమ్మే వ్యక్తి విమానం తయారు చేసిన ఫయాజ్‌

  విమానం తయారు చేసిన ఫయాజ్‌ ఎగిరేందుక సిద్దం అయిన సమయంలో పోలీసులు అతడి ప్రయత్నంను అడ్డుకున్నారు. ఏవియేషన్‌ అధికారుల నుండి అనుమతి లేని కారణంగా విమానంను ఎగరనివ్వం అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. విమానం అంత ఎత్తుకు ఎగరదు, 500 మీటర్ల ఎత్తు నుండే తాను తయారు చేసిన విమానం ఎగురుతుందని అతడు చెప్పినా కూడా అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదు. నేషనల్‌ జియోగ్రఫీ ఇంకా పలు ఛానల్స్‌లో విమానాలు ఎలా పడిపోతాయి, విమానాలు పడిపోవడంకు కారణం ఏంటీ అనే విషయాలను తెలుసుకున్నాడు.

 • వాటి నుండి తన విమానం పడిపోకుండా, పడిపోయినా ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

  Man Builds Homemade Plane Then Uses Road As Runway To Take Off-Pak Popcorn Seller Pakistani పాప్‌కార్న్‌ అమ్మే వ్యక్తి విమానం తయారు చేసిన ఫయాజ్‌

  దీన్ని అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని అతడు భావించాడు. కాని పాక్‌ అధికారులు మాత్రం మూర్ఖంగా అసలు విమానంను ఎగరకుండా చేస్తున్నారు.

 • పాపం ఒక సాదారణ వ్యక్తి కష్టపడి, ఆస్తులు అమ్ముకుని విమానం తయారు చేస్తే దాన్ని ఎగరకుండా చేయండి దారుణం అంటూ స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.